Pregnancy: ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్‌ మార్క్‌ రావొద్దంటే.. ఈ సింపుల్ టిప్స్‌ పాటించండి

|

Sep 01, 2024 | 9:13 AM

ఇక గర్భిణీలు డెలివరి అయితన తర్వాత ఎదురుయ్యే ప్రధాన కారణం స్ట్రెచ్‌ మార్క్‌. అయితే గర్భం దాల్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్ట్రెచ్‌ మార్క్స్‌ సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్ట్రెచ్‌ మార్క్స్‌ వచ్చిన తర్వాత తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. కానీ గర్భం దాల్చిన రోజు ...

Pregnancy: ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్‌ మార్క్‌ రావొద్దంటే.. ఈ సింపుల్ టిప్స్‌ పాటించండి
Pregnancy
Follow us on

ప్రతీ మహిళ జీవితంలో గర్భం దాల్చడం ఎంతో కీలకమైన ఘట్టం. మరో జీవికి ప్రాణం పోస్తునాన్న ఫీలింగ్ మాటల్లో వర్ణించలేనిది. అయితే ఇదే సమయంలో మహిళలు కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. శరీంలో విడుదలయ్యే హార్మోన్ల కారణంగా ఎన్నో మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా బరువు పెరగడంతో పాటు శారీరకంగా మరెన్నో మార్పులకు దారి తీస్తాయి.

ఇక గర్భిణీలు డెలివరి అయితన తర్వాత ఎదురుయ్యే ప్రధాన కారణం స్ట్రెచ్‌ మార్క్‌. అయితే గర్భం దాల్చిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్ట్రెచ్‌ మార్క్స్‌ సమస్య నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా స్ట్రెచ్‌ మార్క్స్‌ వచ్చిన తర్వాత తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. కానీ గర్భం దాల్చిన రోజు నుంచే కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా అసలు ఈ సమస్య రాదని చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గర్భందాల్చిన సమయంలో వీలైనంత వరకు చర్మాన్ని తేమగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారనంగా గర్భం దాల్చిన సమయంలో చర్మం సాగుతుంది. దీంతో చర్మంపై చారలు ఏర్పడుతాయి. కానీ చర్మం తేమగా ఉంటే ఆ సమస్య రాదు. విటమిన్ ఇ, కోకో బటర్, అలోవెరా వంటి వాటిని చర్మంపై అప్లై చేయాలి. ఇలా చేస్తే.. చర్మం మృదువుగా, ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. ఇది స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

* చర్మంపై స్ట్రెచ్‌ మార్క్‌ రాకుండా ఉండాలంటే.. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా నీరు తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రోజుఓ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. చర్మం హైడ్రేట్‌గా ఉంటే సాగిన గుర్తులు ఏర్పడవు.

* స్ట్రెచ్‌ మార్క్స్‌ రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. గర్భదారణ సమయంలో విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఈ పోషకాలు మీ చర్మాన్ని బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

* కడుపుపై క్రమం తప్పకుండా మసాజ్‌ చేసుకోవాలి. అయితే కడుపుపై ఒత్తిడి పడకుండా జెల్స్‌ లేదా కొబ్బరి నూనెతో మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రోజూ 10 నుంచి 15 నిమిషాలు మసాజ్‌ చేసుకోవడం ద్వారా స్ట్రెచ్‌ సమస్య దరిచేరదని నిపుణులు సూచిస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం క్లిక చేయండి..