Lifestyle: ఈ యాంటీ ఏజింగ్ చిట్కాలు పాటించండి.. నిత్యం యవ్వనంగా ఉండండి..

|

Oct 05, 2024 | 2:33 PM

పెరుగుతోన్న వయసుతో పాటు వృద్ధాప్యం రావడం సర్వసాధారణమైన విషయం. ముఖంపై ముడతలు రావడం, చర్మం డ్రైగా మారడం వెరసి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం మారిన జీవన విధానం తీసుకుంటున్నా ఆహారంలో మార్పుల కారణంగా తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని...

Lifestyle: ఈ యాంటీ ఏజింగ్ చిట్కాలు పాటించండి.. నిత్యం యవ్వనంగా ఉండండి..
Anti Aging
Follow us on

పెరుగుతోన్న వయసుతో పాటు వృద్ధాప్యం రావడం సర్వసాధారణమైన విషయం. ముఖంపై ముడతలు రావడం, చర్మం డ్రైగా మారడం వెరసి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం మారిన జీవన విధానం తీసుకుంటున్నా ఆహారంలో మార్పుల కారణంగా తక్కువ వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని రకాల యాంటీ ఏజింగ్ చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించకుండా ఉండాలంటే సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎండలో బయటకు వచ్చేప్పుడు ముఖానికి కచ్చితంగా సన్‌స్క్రీన్‌ను అప్లై చేసుకోవాలని అంటున్నారు. సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది చర్మంపై వచ్చే ముడతలను దూరం చేయడంలో తోడ్పడుతుంది.

* చర్మం తేమను కోల్పోతే త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే చర్మం తేమ కోల్పోకుండా ఉండాలంటే మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే నిత్యం సరిపడ నీటిని తీసుకోవాలని చెబుతున్నారు. రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని తీసుకోవాలి.

* త్వరగా వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉండాలంఏ విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఉత్పత్తులను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ముఖానికి సీరమ్‌ను అప్లై చేసుకోవాలి. రాత్రుళ్లు ముఖాన్ని శుభ్రం చేసుకొని సీరమ్‌ను అప్లై చేసుకొని పడుకోవాలి. ఉదయాన్నే చల్లటి నీటితో కడిగితే ముఖం మెరుస్తుంది.

* చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే ఆహారాన్ని భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. దీనివల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది.

* వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉండాలంటే క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రసరణను మెరుగుపరచడంలో వ్యాయామం ఉపయోగపడుతుంది. చర్మానికి మెరుగైన ఆక్సిజన్‌, పోషణ అందించడంలో సహాయపడతాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..