Kitchen Hacks: మీ వంటలో ఉప్పు ఎక్కువయిందా..? ఏం పర్వాలేదు.. ఈ చిట్కాలను పాటిస్తే సరి..

మనం తీసుకునే ఆహారం ఏదైనప్పటికీ దాని రుచిని పెంచడంలో ఉప్పు ప్రముఖ పాత్రనే పోషిస్తుంది. ఆహారంలో ఉప్పు తక్కువగా ఉంటే సులభంగా మరి కొంత కలిపవచ్చు. కానీ ఉప్పు ఎక్కువ అయితే అప్పుడు ఏం చేయాలి..? చాలా మందికి ఏం చేయాలో..

Kitchen Hacks: మీ వంటలో ఉప్పు ఎక్కువయిందా..? ఏం పర్వాలేదు.. ఈ చిట్కాలను పాటిస్తే సరి..
Too Much Salt In Recipe

Updated on: Dec 07, 2022 | 5:14 PM

మనం తీసుకునే ఆహారం ఏదైనప్పటికీ దాని రుచిని పెంచడంలో ఉప్పు ప్రముఖ పాత్రనే పోషిస్తుంది. ఆహారంలో ఉప్పు తక్కువగా ఉంటే సులభంగా మరి కొంత కలిపవచ్చు. కానీ ఉప్పు ఎక్కువ అయితే అప్పుడు ఏం చేయాలి..? చాలా మందికి ఏం చేయాలో తెలియక నీళ్లను కలుపుతారు. లేదా మరింత ఎక్కువగా కూరను వండుతారు.  ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఆహారానికి ఉన్న రుచి పోవడమే కాక చేదుగా మారుతుంది. అయితే పొరపాటుగా మీరు మీ వంటలో ఉప్పు ఎక్కువగా వేస్తే దానిని అనేక విధాలుగా సరిచేయవచ్చు. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చాలు మీ వంటకంలోని ఎక్కువైన ఉప్పు సమస్య తీరిపోతుంది. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బంగాళాదుంపలు..

మీ ఆహారంలో అవసరానికి మించిన ఉప్పు ఉంటే దానిలో బంగాళదుంప ముక్కలను కలపండి. ఇది ఆహారంలో ఉండే అదనపు ఉప్పును గ్రహించేస్తుంది. అయితే మీరు మీ ఆహారంలోకి బంగాళాదుంప ముక్కలను కలిపే ముందు వాటిని బాగా కడగాలి. దీని తరువాత ముక్కలపై తొక్క తొలగించి అప్పుడు మీ ఆహారంలో కలపి 20 నిముషాలు కదపకుండా వదిలేయండి. తర్వాత ఉప్పు సరిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తాజా మీగడ

కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే దానిని తగ్గడానికి తాజా మీగడను కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఉప్పు తగ్గడమే కాకుండా మీ కూర రుచిగా మారుతుంది.

ఉడికించిన బంగాళాదుంపలు

పప్పు లేదా కూర చాలా ఉప్పగా ఉంటే దానిలో ఉడికించిన బంగాళాదుంపలను ఉపయోగించవచ్చు. దీని కోసం కూర లేదా పప్పులో 2, 3 ఉడికించిన బంగాళదుంపలను కలిపితే చాలు. ఎక్కువైన ఉప్పును అవి గ్రహించుకుంటాయి.

పెరుగు..

కూర చాలా ఉప్పగా ఉంటే దానికి 1 టేబుల్ స్పూన్ పెరుగును కలపవచ్చు. ఆ తర్వాత దాన్ని 5 నిమిషాలు ఉడికించాలి. ఫలితంగా కూరలోని ఉప్పు తగ్గిపోతుంది.

నిమ్మకాయ సిరప్..

ఇండియన్, మొఘలాయ్, చైనీస్ వంటకాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటే నిమ్మకాయను ఉపయోగించవచ్చు. దీని కోసం డిష్‌లో కొంచెం నిమ్మరసం కలపండి. ఇది ఎక్కువగా ఉన్న ఉప్పును పీల్చుకుంటుంది.

బ్రెడ్

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Loading...
Unable to load recommendations.
Follow Us