Silver Anklets: మనపూర్వీకులు పెట్టిన సంప్రదాయంలో పరమార్ధం ఉందా.. పట్టీలతో మహిళలకు ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా

|

Jun 25, 2021 | 5:35 PM

Silver Anklets : మన పూర్వీకులు పెట్టిన ఆహార నియమాలు.. వస్త్రధారణ, అలంకారం  ప్రతిదానికి ఒక పరమార్ధం దాగి ఉంది. ముఖ్యంగా ఆడవారు  కళ్ళకు కాటుక, కాళ్ళకి పట్టీలు పెట్టుకోవోడం..

Silver Anklets: మనపూర్వీకులు పెట్టిన సంప్రదాయంలో పరమార్ధం ఉందా.. పట్టీలతో మహిళలకు ఎన్ని ఆరోగ్యప్రయోజనాలో తెలుసా
Silver Anklets
Follow us on

Silver Anklets : మన పూర్వీకులు పెట్టిన ఆహార నియమాలు.. వస్త్రధారణ, అలంకారం  ప్రతిదానికి ఒక పరమార్ధం దాగి ఉంది. ముఖ్యంగా ఆడవారు  కళ్ళకు కాటుక, కాళ్ళకి పట్టీలు పెట్టుకోవోడం వెనుక హిందూ సంప్రదాయమే కాదు.. అందులో మహిళకు చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. ముఖ్యంగా  ,చేతులకు గాజులు కాళ్లకు పట్టిలు కేవలం అందానికి మాత్రమే పెట్టుకుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ, వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నేటి మహిళలు ఫ్యాషన్ కోసం పెట్టుకుంటున్నా,  పట్టీలు పెట్టుకోడం వల్ల ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే .. ఎప్పుడూ పట్టీలను పెట్టుకునే ఉంటారు.

@ కాలికి పట్టీలు కొన్ని నరాలని ఎప్పుడు తాకుతూ ఉంటాయి. దాంతో ఆక్యుపంక్చర్ టెక్నిక్ ద్వారా బ్లడ్ సర్కిలేషన్ సరైన ట్రాక్‌లో ఉంటుందని పూర్వం భావించేవారు.

@ పాదానికి ఎప్పుడూ రాసుకుంటూ ఉండే పట్టీల వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అందువల్ల పాదాల వాపు తగ్గుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్న వారికి ఈ పాదాల నొప్పి పైవరకూ పాకుతుంది. రెగ్యులర్ గా వెండి పట్టీలు పెట్టుకోవడం వల్ల ఈ సమస్యని తగ్గించవచ్చు.

@పట్టీల వలన కాళ్ళ ఎముకలు గట్టిగా ఉంటాయని, అంతేకాకుండా పట్టీల వలన రక్తప్రసరణ బాగా జరిగి మహిళల హార్మోన్స్ సమస్యలు, నెలసరి సమస్యలు, గర్భ సమస్యలు కంట్రోల్‌లో ఉంటాయి.

@ స్త్రీలు సాధారణంగా హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ ను ఎదుర్కొంటారు.. దీంతో  పీరియడ్స్ సరిగా రాకపోవడం వంటివి ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే వెండి  పట్టీలు రెగ్యులర్ గా పెట్టుకోవటం రుతు సమస్యలు రాకుండా ఉంటాయి. గర్భవతులు తప్పనిసరిగా వెండి పట్టీలు పెట్టుకోవాలని అంటారు. దాని వల్ల ప్రసవ సమయం లో వచ్చే నొప్పి బాగా తగ్గుతుందట.

@ మన కాళ్ళూ చేతుల నించి ఎప్పుడూ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ మనకి పాజిటీవ్ వైబ్రేషన్స్ తీసుకొస్తాయి. మనం చెప్పులు లేకుండా నేల మీద నిల్చున్నప్పుడు భూమి నుంచి కూడా కొంత ఎనర్జీ మనకి వస్తుంది. శరీరం మీద వెండి ఉండటం వల్ల ఆ ఎనర్జీ పాజిటివ్ గా ఉంటుంది. ఇంట్లో చెప్పులు లేకుండా నడిచే స్త్రీలు తప్పనిసరిగా వెండి పట్టీలు పెట్టుకోవాలి.

@ వెండితో చేయించే పట్టీలు ఎప్పుడు గలగలా చప్పుడు చేస్తూ ఉంటాయి. వెండికి ఉండే యాంటి-బాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆడపిల్లలు ఇంట్లో నవ్వుతూ తిరుగుతూ ఉంటె..  ఇల్లంతా సంతోషంగా ఉంటుందని పెద్దలుఅభిప్రాయం.

Also Read: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల రాకుండా రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్ ఏమిటంటే