Pepper-Lemon Water: గ్యాస్ ప్రాబ్లెమ్‌తో ఇబ్బంది పడుతున్నారా.. పొద్దున్నే ఈ వాటర్‌తో చెక్ పెట్టండి..

Pepper-Lemon Water: ప్రస్తుత జనరేషన్ లో ఎక్కువమంది అమ్మాయిలు సన్నజాజుల్లా సన్నగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. అందుకు శారీరక శ్రమ కంటే.. ఎక్కువగా తిండి మానెయ్యడానికే ఎక్కువ...

Pepper-Lemon Water: గ్యాస్ ప్రాబ్లెమ్‌తో ఇబ్బంది పడుతున్నారా.. పొద్దున్నే ఈ వాటర్‌తో చెక్ పెట్టండి..
Pepper And Lemon Water

Updated on: Apr 15, 2021 | 3:45 PM

Pepper-Lemon Water: ప్రస్తుత జనరేషన్ లో ఎక్కువమంది అమ్మాయిలు సన్నజాజుల్లా సన్నగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. అందుకు శారీరక శ్రమ కంటే.. ఎక్కువగా తిండి మానెయ్యడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇలా బరువు తగ్గాలని బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నవారికి పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది. దీంతో ఏమి చెయ్యాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి గ్యాస్ ప్రాబ్లెమ్ తో ఏమి తినాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. మన వంట ఇల్లే ఆరోగ్యశాల. అందులో ఉండే పదార్ధాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టె మెడిసిన్స్. ఈరోజు గ్యాస్ సమస్యకు చెక్ పెట్టేందుకు చిట్కాలను తెలుసుకుందాం..!

గ్యాస్టిక్ ట్రబుల్ కు మిరియాలు, నిమ్మరసం అద్భుతంగా పని చేస్తాయి. ఇక ఈ రెండిటిని కలిపి మిశ్రమంగా తీసుకుంటే శరీరంలో పేరుకొన్న విషవాయువులను బయటకు పంపిస్తుంది. నిమ్మకాయ, మిరియాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి గొప్ప సహాయకారిగా పని చేస్తుంది. ఇది అన్ని జీర్ణసమస్యలను తొలగించడానికి మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోగనిరోధకశక్తి పెంపొందేందుకు తోడ్పడుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

సహజంగా నిమ్మలో ఉండే సి విటమిన్.. జలుబు, అలెర్జీ వంటి అనేక వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచడానికి మిరియాలు, నిమ్మరసం సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిదే. రక్తనాళాలలో ఉన్న ప్రతిష్టంభనను తొలగిస్తుంది. శరీరంపై గాయాలను త్వరగా నయం చేయడానికి తోడ్పడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

నిమ్మమిరియాల రసాన్ని ఎలా తీసుకోవాలంటే.. దీని తయారీ విధానం చూద్దాం..!

ప్రతి రోజు ఉదయాన్నే గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక చెక్క నిమ్మరసం పిండి, దానికి చిటికెడు ఉప్పు, పావు స్పూన్ మిరియాల పొడి జోడించి తాగాలి.

ఇది ఊబకాయాన్ని తగ్గించడంలో అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. ఇక సహజంగా బరువు తగ్గేందుకు ఆహార నియాలతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే బరువు తగ్గుతారు. జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

Also Read: చికెన్ లో వెరైటీ .. టేస్టీ టేస్టీ చికెన్ దో ప్యాజ్ తయారీ విధానం తెలుసుకుందాం..!

కూతురు పరీక్ష ఫీజు చెల్లించడానికి కిడ్నీలు అమ్ముకుంటాం.. అనుమతివ్వండి అంటూ ప్రభుత్వానికి వినతి

Loading...
Unable to load recommendations.
Follow Us