Pakshi Asana: మహిళల్లో పీసీ ఓడీ, సిస్టులు, నీటి బుడగలు వంటి సమస్యలు వేధిస్తున్నాయా.. నివారణకోసం ఈ ఆసనాన్ని ట్రై చేయండి

|

Apr 19, 2021 | 10:27 AM

Pakshi Asana: ప్రస్తుతం ఆధునిక యుగంలో మహిళకు ఇంటా.. బయటా అన్నింటా పనులే.. కాలంతో పోటీ పడుతూ.. నిద్ర లేచింది మొదలు.. నిద్ర పోయేవరకూ కాలంతో పోటీ పడుతూ.. ఉరుకుల పరుగుల జీవితం గడపాల్సిందే..

Pakshi Asana: మహిళల్లో పీసీ ఓడీ, సిస్టులు, నీటి బుడగలు వంటి సమస్యలు వేధిస్తున్నాయా.. నివారణకోసం ఈ ఆసనాన్ని ట్రై చేయండి
Pakshi Asan
Follow us on

Pakshi Asana: ప్రస్తుతం ఆధునిక యుగంలో మహిళకు ఇంటా.. బయటా అన్నింటా పనులే.. కాలంతో పోటీ పడుతూ.. నిద్ర లేచింది మొదలు.. నిద్ర పోయేవరకూ కాలంతో పోటీ పడుతూ.. ఉరుకుల పరుగుల జీవితం గడపాల్సిందే.. దీంతో శారీరక మానసిక ఒత్తిడికి గురవుతుంది నేటి మహిళ.. ఇక శరీర అనోగ్యానికి కూడా లోనవుతుంది.. మానసిక ఒత్తిడిని జయించడానికి రోజు రోజుకీ యోగానికి అనుసరించే వారి సంఖ్య పెరుగుతుంది.
ఈరోజుల్లో ఎక్కువమంది మహిళలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్)తో బాధ పడుతున్నారు. దీంతో రుతుక్రమం సరిగ్గా లేకపోవడం, అండోత్పత్తి జరగకపోవడం వంటి లక్షణాలతో పాటు.. దీర్ఘకాలికంగా మొటిమలు, ఊబకాయం లాంటి అనేక రకాల హార్మోనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదువుల్లో, ఆఫీసుల్లో ఉండే విపరీతమైన ఒత్తిడివల్ల విద్యార్థులు, ఉద్యోగులు పీసీఓఎస్ బారిన పడుతున్నారు. అయితే పీసీఓఎస్‌తో బాధపడేవారు డాక్టర్ చికిత్స తీసుకుంటూనే కొన్ని యోగాసనాలు సాధన చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అలా గర్భాశయానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక ఆసనమే పక్షిక్రియ లేదా బటర్‌ఫ్లై ఆశనం. దీనిని వేయు పద్దతి.. ఉపగయోగాలు తెలుసుకుందాం..!

ఆసనం వేయు విధానం:

ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. తరువాత రెండు పాదాలను మడిచి, ఒకదానికి దగ్గరికి మరొకటి తీసుకు రావాలి. రెండు చేతులతో పాదాలను పట్టుకోవాలి. వీపు నిటారుగా ఉంచి, పొట్ట లోపలికి లాగి రెండు కాళ్లనూ పైకి, కిందకీ కదిలించాలి. ఇలా కాళ్లు పైకి వచ్చినప్పుడు మోచేతులకు ఆనించాలి. మళ్లీ కిందికి వెళ్లినప్పుడు భూమికి సమాంతరంగా ఉండేట్లు చూసుకోవాలి. ముందుగా 20 నుంచి మొదలుపెట్టి వందవరకు చేయవచ్చు. చివరగా గాలి పీల్చి వదిలేస్తూ తలను ముందుకు వంచి పాదాలను తాకేలా చూసుకోవాలి. అక్కడ కొన్ని సెకన్ల పాటు ఆగి… తరువాత గాలి పీల్చుకుంటూ యథాస్థానానికి రావాలి.

ఈ ఆసనం వల్ల ఉపయోగాలు :

కాళ్లకు శక్తినిస్తుంది.
మోకాళ్ల నొప్పినుంచి ఉపశమనాన్నిస్తుంది.
శరీరం తేలికగా తయారవుతుంది.
పొత్తికడుపు దగ్గర అధికంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది.
మధుమేహం, థైరాయిడ్ సమస్యలను కూడా నివారిస్తుంది.
ముఖ్యంగా ఈ ఆసనం వల్ల కటి భాగానికి ఎక్కువ ఎక్సర్‌సైజ్ అయి లోపల ఉన్న అవయవాలకు మంచి మసాజ్ ఇస్తుంది. దీంతో ఆయా భాగాలు చక్కగా పనిచేస్తాయి.

జాగ్రత్తలు :

అయిదు ఈ ఆసనం అధిక వెన్నునొప్పితో బాధపడుతున్నవారువేయకపోవడం మంచిది. అంతేకాదు ఆరోగ్యంగా ఉన్నవారు సైతం అధిక శ్రమ పడకుండా సామర్థ్యం ఉన్నమేరకే చేయాలి.

Also Read:  దేశంలో కరోనా విలయతాండవం.. కోటిన్నర దాటిన కేసుల సంఖ్య.. నిన్న కూడా రికార్డు స్థాయిలోనే..