ప్రస్తుతం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య ప్రతి ఒక్కరిని మానసికంగా కుంగదీస్తుంది. జుట్టు రాలిపోవడం వలన చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. కొందరికి జన్యుపరంగా ఈ సమస్య తలెత్తితే.. కొందరికి మాత్రం వారి అలవాట్ల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. లింగ బేధం లేకుండా ఏర్పడే ఈ సమస్యకు మన జీవనశైలి కూడా కారణం కావచ్చు. అలాగే జీవన విధానంలో మార్పులు, ఆహారపు అలవాట్లు జుట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఈ సమస్య నివారణ కోసం మార్కెట్లో ఎన్నో రకాల షాంపులు, నూనేలు విచ్చలవిడిగా దొరుకుతుంటాయి. కానీ ఎన్ని రకాల ప్రొడక్ట్స్ వాడినా ఫలితం మాత్రం కనిపించదు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి మీ జీవన శైలీలో కొన్ని రకాల మార్పులు చేస్తే సరిపోతుంది. మరి అవెంటో తెలుసుకుందామా.
❁పోషకాహారం.. మీ జుట్టు అందంగా ఉండాలంటే.. శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. అందుకోసం మాంసం, చేపలు, నట్స్, పచ్చని ఆకు కూరలు వంటి ఆహారాన్ని మీ రోజువారీ డైట్‌లో చేర్చుకోండి. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మీ జుట్టుకు కూడా భద్రత లభించవచ్చు.
❁ జుట్టును కప్పి ఉంచండి.. చాలా మంది జుట్టును వదిలేస్తుంటారు. బయటకు వెళ్ళేప్పుడు జుట్టుకు దుమ్ము ధూళి నుంచి రక్షణ కల్పించాలి. బయటకు వెళ్ళే ముందు స్త్రీలు తమ జుట్టుకు స్కార్ఫ్ లాంటివి కట్టుకోవడం.. లేదా టోపీ పెట్టుకోవడం వలన జుట్టును హానికరమైన ధూళీకణాల నుంచి రక్షించుకోవచ్చు. అలాగే యూవీ రేస్ కూడా నుంచి వెలువడే రేడియేషన్ కూడా జుట్టుకు హానికరమని పరిశోధనల్లో తేలింది. అవి తలలోని ప్రోటీన్లకు నష్టం కలిగిస్తాయి. దీనివల్ల జుట్టు త్వరగా ఊడిపోతుంది.
❁ఒత్తిడికి దూరంగా.. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి ఎదురుయ్యే సమస్య ఇది. ఒత్తిడి వలన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా జుట్టు రాలడానికి ప్రధాన కారణం. ఒత్తిడి వల్ల జుట్టు రాలడమే కాకుండా హెయిర్ గ్రోత్ సైకిల్‌కు ఆటంకంగా మారుతుంది. కాబట్టి, రోజు వ్యాయామం లేదా యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కంటి నిండా నిద్రపోండి.
❁ చెడు వ్యసనాలు.. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. స్మోకింగ్ అలవాటు మానేయ్యాలి. పొగతాగేవారిలో జుట్టు కుదుళ్లలోని డీఎన్ఏను నాశనం చేసి జుట్టు ఎదగకుండా చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి.. స్మోకింగ్‌కు దూరంగా ఉండి మీ జుట్టును రక్షించుకోండి.
❁ ఎక్కువగా స్టైలింగ్ చేయకూడదు.. జుట్టును ఎక్కువ సార్లు స్టైలింగ్ చేయకూడదు.. చాలా మంది హెయిర్ డ్రైయర్స్, స్ట్రైటనింగ్ వంటి పరికరాలను వాడడం అసలు మంచిది కాదు. వీటిని ఎక్కువగా వాడడం వలన జుట్టు కుదుళ్ళు నాశనమవుతాయి. అలాగే జుట్టను మరింత సన్నగా మార్చే్స్తాయి. జుట్టుకు వేడిని అందించే ఈ పరికరాలను అప్పుడప్పుడు మాత్రమే వాడాలి.
Also Read:
డిప్రెషన్‌కు గురవుతున్నారా ?.. అయితే మీరు డేంజర్లో ఉన్నట్టే.. అధ్యాయనాల్లో బయటపడ్డ విషయాలు..