Paripoorna Supta Vajrasana: శారీరకంగా ఆరోగ్యాన్ని.. మానసికంగా ప్రశాంతతను ఇచ్చేది యోగా. ఇది మన జీవన విధానంలో అద్భుతమైంది. ఒత్తిడిని నివారించి.. మనసును శాంతపరుస్తుంది. అయితే అనేక రకాల ఆసనాలు .. వేర్వేరు ప్రయోజనాలను ఇస్తాయి. అయితే రోజురోజుకి వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మనం పీలుస్తున్న గాలి కూడా కాలుష్యంతో నిండి ఉన్నదే.. దీంతో ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఊపిరితిత్తుల పనితీరుని మెరుగుపరిచే పరిపూర్ణశుప్త వజ్రాసనం గురించి ఈరోజు తెలుసుకుందాం..!
ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి.
తర్వాత నెమ్మదిగా పాదాలను రెండూ.. ఎడంగా జరపాలి.
అనంతరం నడుం భాగాన్ని పాదాల మధ్యన నేలకు ఆనేటట్లుగా ఉంచాలి.
ఇప్పుడు నెమ్మదిగా రెండు మోచేతులూ పక్కగా ఆన్చి శరీరాన్ని నెమ్మదిగా వెనుకగా భూమి మీదకు ఆన్చాలి.
మొత్తం శరీరం నేలకు ఆనేటట్లుగా ఉంచాలి.
రెండు చేతులనూ ఒకదానితో ఒకటి పెనవేసి తల మీదగా నిటారుగా భూమిమీద ఉంచాలి.
ఇదే స్థితిలో ఊపిరి మామూలుగా పీలుస్తూ ఉండగలిగినంత సమయం ఉండి మెల్లగా యథాస్థితికి రావాలి.
రిబ్‌కేజ్‌ను ఓపెన్ చేస్తుంది కాబట్టి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి సహాయ పడుతుంది
ఆస్తమా ఉన్నవారికి మంచిది
థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఉపయోగకరం
అయితే ఈ ఆసనం వేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మోకాలి నొప్పులు ఉన్నవారు కొద్దిసెకన్లపాటు మాత్రమే ఈ ఆసనాన్ని వేయాలి. అదే నొప్పి ఎక్కువగా ఉన్నవారు చేయరాదు. ఇక సయాటికా ఉన్నవారు అసలు ఈ ఆసనాన్ని చేయకూడదు. స్లిప్‌డిస్క్, మోకాళ్ల నొప్పులు ఉన్నవారు చేయకూడదు.
Also Read: హైటెక్ పద్ధతిలో మొక్కజొన్న పొత్తులను కాలుస్తున్న బామ్మ.. పిక్ ను షేర్ చేసిన వివిఎస్ లక్ష్మణ్