Yoga For Students: పరీక్ష ఒత్తిడి మీ పిల్లల్ని బాధిస్తుందా.. ఈ 4 యోగాసనాలు ట్రై చేయమనండి..

పరీక్షలు వస్తున్నాయంటే చాలు ప్రస్తుతం పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాల, పరీక్షలు, తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే ఒత్తిడి కారణంగా, చాలా మంది పిల్లలు మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. పరీక్షల సమయంలో పిల్లలు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు నిత్యం యోగాను చేయాలి. ఈ రోజు స్టూడెంట్స్ కోసం కొన్ని సులభమైన యోగా ఆసనాల గురించి తెలుసుకుందాం.. వీటిని చేయడం ద్వారా పిల్లలు అన్ని రకాల ఒత్తిడి నుంచి బయటపడతారు. 

Yoga For Students: పరీక్ష ఒత్తిడి మీ పిల్లల్ని బాధిస్తుందా.. ఈ 4 యోగాసనాలు ట్రై చేయమనండి..
Best Yoga AsanasImage Credit source: Freepik
Follow us

|

Updated on: Feb 16, 2024 | 8:25 PM

దాదాపు ప్రతి రంగంలోనూ 2024 సంవత్సరానికి సంబంధించిన బోర్డ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల ఒత్తిడి వల్ల పిల్లలు ఒత్తిడికి గురికావడం సర్వసాధారణం. ఈ ఒత్తిడి కారణంగా పిల్లలు మానసిక, శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి కారణంగా పరీక్ష సన్నాహాలపై సరిగ్గా ఏకాగ్రత పెట్టలేక పోవడం వల్ల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బోర్డు పరీక్షలు అంటే మొదటి నుండి విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే ఇది వారి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి కొత్త దిశను నిర్దేస్తుంది కనుక. అయితే పరీక్షలు వస్తున్నాయంటే చాలు ప్రస్తుతం పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాల, పరీక్షలు, తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే ఒత్తిడి కారణంగా, చాలా మంది పిల్లలు మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు.

పరీక్షల సమయంలో పిల్లలు ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు నిత్యం యోగాను చేయాలి. ఈ రోజు స్టూడెంట్స్ కోసం కొన్ని సులభమైన యోగా ఆసనాల గురించి తెలుసుకుందాం.. వీటిని చేయడం ద్వారా పిల్లలు అన్ని రకాల ఒత్తిడి నుంచి బయటపడతారు.

బాలాసన: దీనినే చైల్డ్ పోజ్ అని కూడా అంటారు. ఇది చేయడానికి మోకాళ్లను వంచి చాపపై కూర్చోవాలి. ఆపై చేతులను ముందుకి నిటారుగా ఉంచుతూ నేలను తాకాలి. ఈ భంగిమలో దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ వదలాలి. ఈ భంగిమలో కొంత సమయం ఉండటం వల్ల శరీరానికి ఎంతో ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

భుజంగాసనం: ఈ ఆసనం పిల్లల్లో ఏకాగ్రతకు సహాయపడుతుందని నమ్ముతారు. దృష్టిని మెరుగుపరచడం ద్వారా పిల్లల ఒత్తిడి తగ్గుతుంది. దీన్ని చేయడానికి పిల్లవాడిని తన కడుపుపై ​​నేలపై పడుకోవాలి. ఇప్పుడు రెండు అరచేతులను తొడల దగ్గర నేలపైకి తీసుకోవాలి. మీ చేతులను భుజాల దగ్గర ఉంచి, తలను ఎత్తండి.  శరీరం మొత్తం బరువును అరచేతులపై ఉంచండి. ఇప్పుడు దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని వదలండి. అదే  సమయంలో ఛాతీని ముందుకు నెట్టడానికి ప్రయత్నించండి.

తాడాసనం: ఈ ఆసనం చేయడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా పిల్లల శరీర భంగిమ కూడా మెరుగుపడుతుంది. ఈ ఆసనంలో అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఈ ఆసనం చేయడం వల్ల పిల్లల ఎత్తులో తేడా కనిపిస్తుంది. తాడాసనం చేయడం చాలా సులభం. ముందుగా పిల్లలను కాళ్లతో నేరుగా నిటారుగా నిలబడమని చెప్పండి. ఇప్పుడు గాలిలో చేతులు ఎత్తి.. ఆపై వారి పాదాలను వేళ్ళమీద నిలిచేలా కాళ్ళను పైకి లేవమని చెప్పండి. ఈ ఆసనాన్ని చాలా ఉత్సాహంతో చేస్తాడు. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆసనం పిల్లలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తారు.

పద్మాసనం: ఈ ఆసనం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని. దీంతో పిల్లలకు చదువులో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఎవరైనా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లయితే తన దినచర్యలో భాగంగా ఈ ఆసనం చేర్చుకోవాలి. ఖచ్చితంగా ఈ ఆసనం వేయాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..