Beauty Tips For Face: అందమైన ముఖ వర్చస్సు ఉండాలని ప్రతి మగువ కోరుకుంటుంది. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే వాతావరణంలోని కాలుష్యం, ఆహారపు అలవాట్లు, జీవన శైలి చర్మం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ముఖంపై మచ్చలు, మొటిమలు ఏర్పడతాయి. అయితే కొంతమంది బ్యూటీ పార్లర్ ను ఆశ్రయిస్తే.. మరికొందరు సహజమైన పద్ధతులను పాటించడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే రోజూ సింపుల్ చిట్కాలను ఫాలో అయితే . నిగనిగలాడే ముఖ వర్చస్సు మీ సొంతం అవుతుంది. వంటింట్లో దొరికే సహజమైన పదార్ధాలను ఉపయోగించి మొటిమలు, మచ్చలు లేని అందమైన ముఖ వర్చస్సు మీ సొంతం చేసుకోవచ్చు.. మరి ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందామా..
*ఒక టమాటా తీసుకుని దానిని కట్ చేసి.. దాని నుంచి రసం వేరుచేసుకుని ఉప్పు వేసి మిక్స్ చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సున్నితంగా ముఖంపై అప్లై చేయాలి.. ఇది ముఖంపై సహజ బ్లీచింగ్ లా పనిచేస్తుంది. ముఖంపై విటమిన్ సి వలన మృతకణాల్ని తొలగిస్తుంది. ముఖం మెరుపును సంతరించుకుంటుంది.
*కొంచెం ఉప్పు ధూళి, గ్రిమ్, విషాన్ని గ్రహించి, మీ చర్మపు రంధ్రాలను లోతుగా శుభ్రపరుస్తుంది. ఉప్పు యొక్క ఖనిజ కంటెంట్ చర్మంలో రక్షణ అవరోధం పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. అది హైడ్రేటెడ్గా ఉండేందుకు సహాయపడుతుంది. సముద్రపు ఉప్పులోని మెగ్నీషియం కూడా చర్మంలోని నీటిని నిలుపుదలను తగ్గించి చర్మపు ఉబ్బుని తగ్గించడంలో సహాయపడుతుంది.
*పసుపు, శనగపిండి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసుకొని.. కొంచెం ఆరిన తరువాత నీటితో తడుపుతూ బాగా మసాజ్ చేయాలి. నెమ్మదిగా సర్కులర్ మోషన్ లో చేతి వేళ్లతో మసాజ్ చేయడం వలన చర్మకణాలు శుభ్రపడి ముఖం కాంతివంతంగా, తాజాగా తయారవుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
*పసుపు చర్మానికి మంచి ఔషధం. పసుపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మచ్చలు రాకుండా చేస్తాయి. ముఖ చర్మాన్ని, ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇక శనగపిండి చర్మాన్ని ముడతలు లేకుండా చేస్తోంది. చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా ఉంచుతుంది. స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.
Also Read: Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం