Youngest Yoga Teacher: ప్రతిభకు వయసుతో పనిలేదు.. తెలివి తేటలు, ఏ విషయాన్నీ అయినా వెంటనే గ్రహించే నేర్పు.. ఉంటే పిల్లలు కాదు వీరు పిడుగులు అనిపించుకుంటూ.. అనేక రికార్డులను సృష్టిస్తారు. తాజాగా ఓ చిన్నారి బుడతడు అనుకున్నది సాధించడానికైనా వయసుతో సంబంధం లేదనడానికి మరో నిదర్శనంగా నిలిచాడు. ఎందరికో స్పూర్తిదాయకమైన ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఈ వీడియోలో కనిపిస్తున్న బుడతడి వయసు 9 ఏళ్లు మాత్రమే. కానీ అంత చిన్న వయసులోనే గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేశాడు. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే యోగా గురువుగా మారి రికార్డు సృష్టించాడు. మామూలు యోగా ఇన్‌స్ట్రక్టర్ కాదు.. సర్టిఫై చేసిన యోగా గురువు ఆ బాలుడు. దుబాయ్‌లో ఉండే ఇతని పేరు రెయాన్ష్ సురానీ.. ఈ బుడతడు భారతీయుడే.. అయితే తన తల్లిదండ్రులతో కలిసి తన చిన్నతనంలోనే దుబాయ్ వెళ్లిపోయాడు. తన 4 ఏళ్ల వయసు నుంచే యోగా చేయడం ప్రారంభించాడు రెయాన్ష్. 200 గంటల యోగా టీచర్ ట్రెయినింగ్ కోర్సును కూడా పూర్తి చేశాడు. జులై 27, 2021న ఆనంద్ శేఖర్ యోగా స్కూల్ నుంచి యోగా సర్టిఫికెట్‌ను కూడా అందుకున్నాడు.
He has completed over 200 hours of intense yogi training!
— Guinness World Records (@GWR) February 19, 2022
అంత చిన్న వయసులోనే యోగా ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు.. రెయాన్ష్ పేరును గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించారు. ఇప్పుడు యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా మారాడు రెయాన్ష్. యోగా నేర్చుకునే వాళ్లకు ప్రైవేటుగా క్లాస్‌లు తీసుకోవడంతో పాటు.. తన స్కూల్‌లో కూడా తన తోటి విద్యార్థులకు కూడా రెయాన్ష్ యోగా నేర్పిస్తున్నాడు.
Also Read: