Fart Walk: ఆ సమస్యలకు పరిష్కారం ‘ఫార్ట్‌ వాకింగ్‌’.. ఇంతకీ ఇది ఏంటనేగా.?

|

Jul 08, 2024 | 2:43 PM

టొరంటోకు చెందిన కుక్‌బుక్‌ రచయిత్రి మెయిర్లిన్‌ స్మిత్ ఈ ఫార్ట్‌ వాక్‌ను ప్రతిపాదించారు. ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్‌, గుండెలో మంట వంటి జీర్ణ సంబంధిత సమస్యలన్నింటికీ ఈ వాకింగ్ పరిష్కారమని చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం అనేది ఈ వాకింగ్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఫైబర్‌ కంటెంట్‌ ఉండే ఆహారం తీసుకున్న వెంటనే కడుపు ఉబ్బిన భావన కలుగుతుంది...

Fart Walk: ఆ సమస్యలకు పరిష్కారం ఫార్ట్‌ వాకింగ్‌.. ఇంతకీ ఇది ఏంటనేగా.?
Fart Walk
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్ లేదా జాగింగ్ చేయాలని మనందరకీ తెలిసిందే. అయితే మీరు ఎప్పుడైనా ఫార్ట్‌ వాకింగ్‌ గురించి విన్నారా.? ఫార్ట్‌ అంటే అపానవాయువు అని అర్థం. సాధారణంగా ఈ సమస్య జీర్ణ సంబంధిత సమస్యల వల్ల వస్తుంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కాంగానే ఈ ఫార్ట్ వాకింగ్‌ను సూచిస్తున్నారు.

టొరంటోకు చెందిన కుక్‌బుక్‌ రచయిత్రి మెయిర్లిన్‌ స్మిత్ ఈ ఫార్ట్‌ వాక్‌ను ప్రతిపాదించారు. ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్‌, గుండెలో మంట వంటి జీర్ణ సంబంధిత సమస్యలన్నింటికీ ఈ వాకింగ్ పరిష్కారమని చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం అనేది ఈ వాకింగ్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఫైబర్‌ కంటెంట్‌ ఉండే ఆహారం తీసుకున్న వెంటనే కడుపు ఉబ్బిన భావన కలుగుతుంది. అలాగే పడుకుంటే గ్యాస్‌ సమస్యలకు దారి తీస్తుందని స్మిత్‌ చెబుతున్నారు.

రాత్రి భోజనం చేసిన 60 నిమిసాల తర్వాత ఈ ఫార్ట్‌ వాకింగ్‌ చేయాలని స్మిత్‌ సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత చేసే ఈ వాకింగ్‌ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిని జీర్ణశంయాంత ట్రాక్ట్‌గా పిలుస్తుంటారు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది. ఇంతకీ ఫార్ట్ వాకింగ్ జీర్ణక్రియను ఎలా మెరుగుపరుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ అండ ఒబెసిటీ అే జర్నల్‌ ప్రకారం.. మెరుగైన గట్ చలనశీలత భోజనం తర్వాత నడకతో సాధ్యమవుతుంది. ఈ వాకింగ్‌ గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆహారాన్ని కడుపు నుంచి చిన్న పేగులకు తరలించేందుకు ఈ వాకింగ్ ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. ప్రతిరోజూ 30 నిమిషాల నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని చెబుతోంది. అలాగే నడక కడుపులో అంతర్గత ఒత్తిడిని సృష్టించి, గ్యాస్‌ విడుదలకు ఉపయోపడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే తిన్న వెంటనే కాకుండా ఒక 40 నుంచి 60 నిమిషాల తర్వాతే వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. వేగంగా కాకుండా నెమ్మదిగా నడవాలి. వాకింగ్ చేసిన తర్వాత నీరు తాగాలి. దీనివల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..