Lifestyle: పెరుగులో ఇవి కలిపి తింటున్నారా.? చాలా డేంజర్‌ అంటోన్న నిపుణులు

|

Oct 14, 2024 | 10:01 AM

ఆరోగ్యానికి పెరుగు చేసే మేలు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిందే. పెరుగులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ మొదలు శరీరంలో ఎన్నో జీవక్రియలకు పెరుగు ఉపయోపగడుతుందని నిపుణులు చెబుతుంటారు. ఎన్ని రకాల కూరలు ఉన్నా చివరల్లో ఒక్క బుక్కైనా పెరుగుతో తినమని నిపుణులు సైతం చెబుతుంటారు...

Lifestyle: పెరుగులో ఇవి కలిపి తింటున్నారా.? చాలా డేంజర్‌ అంటోన్న నిపుణులు
Curd
Follow us on

ఆరోగ్యానికి పెరుగు చేసే మేలు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిందే. పెరుగులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ మొదలు శరీరంలో ఎన్నో జీవక్రియలకు పెరుగు ఉపయోపగడుతుందని నిపుణులు చెబుతుంటారు. ఎన్ని రకాల కూరలు ఉన్నా చివరల్లో ఒక్క బుక్కైనా పెరుగుతో తినమని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే మనలో కొందరు పెరుగులో ఇతర కూరలు కలుపుకుని తింటుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. పెరుగులో కొన్ని రకాల ఫుడ్స్‌ను కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పెరుగులో వెల్లుల్లిని కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలో వేడి చేసే గుణం ఉంటుంది. పెరుగు, వెల్లుల్లి కలిపి తీసుకుంటే కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.

* పెరుగు సలాడ్స్‌లో ఉల్లిపాయను కలిపి తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఇలా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు, ఉల్లిపాయ తింటే పేగు నొప్పి వస్తుందని అంటున్నారు. జీర్ణ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

* సలాడ్‌లో ఉల్లిపాయతో పాటు దోసకాయను కూడా కలుపుకుంటారు. అయితే ఇది కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. దోసకాయలో 70 శాతం నీరు ఉంటుంది. దీంతో పెరుగు, దోసకాయ కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

* ముల్లంగిలో కూడా వేడి స్వభావం ఉంటుంది. ముల్లంగి, పెరుగును కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఇలా తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్‌ సంబంధిత సమస్యలు వస్తాయి.

* పెరుగులో టమాటను కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీంఓ అజీర్ణం, అసిడిటీ సమస్యలు వస్తాయి. టమాటలో ఆమ్ల గుణం ఉంటుంది. అదే విధనంగా పెరుగులో కూడా ఆమ్ల గుణం ఉంటుంది. దీంతో ఈ రెండు కలిపి తీసుకుంటే అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, వీటిని కలిపి ఎప్పుడు తినొద్దు.

* పాలకూర, పెరుగును కలిపి తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాలకూరలో ఆక్సాలిక్‌ యాసిడ్ ఉంటుంది. ఇది కాల్షియం శోషణకి ఆటంకం కలిగిస్తుంది. దీని వల్ల కడుపునొప్పి వస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..