Elaichi Water Benefits: పరగడుపునే యాలకులు వేసి మరిగించిన నీటిని తాగితే.. శరీరంలో ఏమవుతుందో తెలుసా..?

యాలకులకు డిప్రెషన్‌తో పోరాడే ప్రత్యేక సామర్థ్యం ఉంది. మీ రోజువారీ టీలో ఏలకులను వేసి గానీ, లేదంటే ఏలకుల పౌడర్‌ గానీ వేసుకుని తాగితే..మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తమాను నివారించడంలో యాలకులు చాలా మేలు చేస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు యాలకుల నీటిని తాగాలి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి.

Elaichi Water Benefits: పరగడుపునే యాలకులు వేసి మరిగించిన నీటిని తాగితే.. శరీరంలో ఏమవుతుందో తెలుసా..?
Elaichi Water

Updated on: Jun 19, 2024 | 8:52 PM

యాలకులలో పుష్కలమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. యాలకులు పోషకాల నిధిగా పిలుస్తారు. యాలకులను టీలో గానీ, తాగే నీళ్లలో గానీ వేసి మరిగించి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని మీకు తెలుసా.? యాలకుల్లో విటమిన్లు-రిబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్-సి, ఖనిజాలు-ఐరన్‌, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పినిన్, సబినిన్, మైసిన్, ఫెలాండ్రిన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. యాలకుల నీరు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగిస్తుంది. ఇది బరువు నియంత్రణలో ఉంచేందుకు కూడా సహయపడుతుంది. యాలకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

యాలకుల నీటిని రోజూ తాగడం వల్ల జలుబు, గొంతు నొప్పి నుండి బయటపడవచ్చు. రోజూ ఒక గ్లాసు యాలకుల నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాలకుల విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాలకుల నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడటమే కాకుండా, కడుపునొప్పి నుండి ఉపశమనం పొందడంతోపాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాలకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

యాలకులకు డిప్రెషన్‌తో పోరాడే ప్రత్యేక సామర్థ్యం ఉంది. మీ రోజువారీ టీలో ఏలకులను వేసి గానీ, లేదంటే ఏలకుల పౌడర్‌ గానీ వేసుకుని తాగితే..మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తమాను నివారించడంలో యాలకులు చాలా మేలు చేస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు యాలకుల నీటిని తాగాలి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

యాలకుల బలమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇది మంచి దంత పరిశుభ్రతతో పాటు నోటి దుర్వాసనను శాశ్వతంగా తొలగించడంలో సహాయపడుతుంది. యాలకులలో లభించే ఫైటోకెమికల్ అయిన సినియోల్, దుర్వాసన బాక్టీరియాను చంపడానికి, కావిటీస్ మరియు దంత క్షయాన్ని నిరోధించడానికి తెలిసిన శక్తివంతమైన క్రిమినాశకగా పనిచేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us