Salt: కూరలో అదనంగా ఉప్పు వేసుకుంటున్నారా.? ఈ సమస్య కూడా తప్పదు..

|

Aug 12, 2024 | 10:31 PM

ఉప్పు.. 'అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు' అంటుందని అంటుంటారు. అంటే కూరకు రుచి రావడంలో ఉప్పు ప్రాధాన్యత ఏంటో ఈ సామెత చెబుతుంది. నిజంగా కూర ఎంత అద్భుతంగా వండినా దాంట్లో సరిపడ ఉప్పు లేకపోతే కూరకు రుచి రాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కూరకు రుచిని పెంచే ఉప్పు, ఆరోగ్యానికి మాత్రం ఇబ్బంది...

Salt: కూరలో అదనంగా ఉప్పు వేసుకుంటున్నారా.? ఈ సమస్య కూడా తప్పదు..
Salt
Follow us on

ఉప్పు.. ‘అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు’ అంటుందని అంటుంటారు. అంటే కూరకు రుచి రావడంలో ఉప్పు ప్రాధాన్యత ఏంటో ఈ సామెత చెబుతుంది. నిజంగా కూర ఎంత అద్భుతంగా వండినా దాంట్లో సరిపడ ఉప్పు లేకపోతే కూరకు రుచి రాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కూరకు రుచిని పెంచే ఉప్పు, ఆరోగ్యానికి మాత్రం ఇబ్బంది పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ మొదలు హృదయ సంబంధిత సమస్యల వరకు వస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అందుకే ఉప్పును కచ్చితంగా తగ్గించాలని నిపుణులు చెబుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఉప్పును తగ్గించాలని సూచించింది. అయితే మనలో చాలా మంది వంటలు చేసిన తర్వాత భోజనం చేస్తున్న సమయంలో కూరల్లో అదనంగా ఉప్పు వేసుకుంటుంటాం. అయితే మీక్కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండని నిపుణులు చెబుతున్నారు. సాధరణంగా ఉప్పుతో గుండె సంబంధిత సమస్యలు వస్తాయని అనుకుంటాం. అయితే ఉప్పు ఎక్కువగా తింటే జీర్ణాశయ క్యాన్సర్‌ వచ్చే అవకాశం పెరుగుతున్నట్లు తాజా అధ్యయనంలో ఏతలింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్స్‌లో జీర్ణాశయ క్యాన్సర్‌ ఒకటి కావడం గమనార్హం. ఇందకీ జీర్ణాశయ క్యాన్సర్‌ కేసులు ఎందుకు పెరుగుతున్నాయన్న దాని గురించి పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. తరచూ అదనంగా ఉప్పును కలుుకొని తినే వారికి పొట్ట క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు 41 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ఉప్పు జీర్ణాశయంలోని జిగురు పొరను దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇది హెలికోబ్యాక్టర్‌ పైలోరీ బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి దోహదం చేస్తుంది. దీనికారణంగా కడుపులో ఇన్ఫెక్షన్‌ తలెత్తడంతో పాటు.. జీర్ణాశయ పైపొర కణాలను దెబ్బతీయటం వంటి చర్యలతో క్యాన్సర్‌ ముప్పూ పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి జీర్ణాశయ క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవాలంటే కచ్చితంగా ఉప్పును తగ్గించాలని చెబుతున్నారు.