వేపాకు సహజమైన క్రిమిసంహారక లక్షణాలను కలిగి ఉండటంతో పురుగుల సమస్యను తొలగించగలదు. కొన్ని తాజా వేపాకులను బియ్యం డబ్బాలో ఉంచితే పురుగులు రావు. తాజా ఆకులు అందుబాటులో లేకుంటే ఎండిన వేపాకులను కూడా ఉపయోగించొచ్చు. 15 నుంచి 20 రోజులకు ఒక్కసారి ఆకులను మార్చితే మెరుగైన ఫలితాలు పొందొచ్చు.
బిర్యానీ ఆకులు (బే లీవ్స్) కూడా పురుగులను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిని బియ్యంలో ఉంచడం వల్ల పురుగులు చేరవు. కొన్ని ఆకులను బియ్యం నిల్వ చేసే డబ్బాలో ఉంచితే అవి పురుగుల ప్రాణాంతకం అవుతాయి.
లవంగాల్లో ఉండే బలమైన వాసన పురుగులను దూరంగా ఉంచుతుంది. బియ్యం మాత్రమే కాకుండా ఇతర ధాన్యాలను కూడా ఇది కాపాడుతుంది. కొన్ని లవంగాలను పొడి చేసి, క్లీన్ గా ఉన్న క్లాత్ లో చుట్టి మంచిగా ముడి కట్టండి. దాన్ని బియ్యం డబ్బాలో ఉంచితే పురుగులు రావు. దీని వాసన పురుగులను పూర్తిగా తరిమికొడుతుంది.
పురుగులను నివారించడానికి మన పూర్వీకులు ఉపయోగించిన సహజ పద్ధతుల్లో అగ్గిపుల్లలు ఒకటి. వీటిలో ఉండే స్వభావిక వాసన పురుగులను దూరంగా ఉంచుతుంది. కొన్ని అగ్గిపుల్లలను బియ్యం డబ్బాలో ఉంచడం వల్ల పురుగుల సమస్య తగ్గిపోతుంది.
సిలికాన్ జెల్ ప్యాకెట్లు తేమను గ్రహించి, కీటకాల పెరుగుదలను నిరోధించే గుణాలను కలిగి ఉంటాయి. షూ బాక్స్‌లు, వాటర్ బాటిల్స్ లాంటివాటిలో ఈ ప్యాకెట్లు మనకు తరచుగా కనిపిస్తాయి. వీటిని ఉపయోగించి బియ్యంలో పురుగుల సమస్యను తగ్గించవచ్చు. ఒక శుభ్రమైన కాటన్ క్లాత్‌లో సిలికాన్ జెల్ ప్యాకెట్‌ను చుట్టి, బియ్యం నిల్వ చేసే డబ్బాలో ఉంచాలి. ప్రతి నెలకు ఒకసారి దీన్ని మార్చడం వల్ల మరింత ప్రయోజనం పొందొచ్చు.