Relationship Tips: ఉదయాన్నే శృంగారం.. ఆలూమగలు మధ్య దూరం మటుమాయం

ఉదయం లేచింది మొదలు నైట్ పడుకునే వరకు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా గడిపేస్తాం. అలాంటప్పుడు ఒకరితో ఒకరు గడిపే తీరిక, సమయం ఇంకెక్కడుంటుంది. అలానే కంటిన్యూ చేస్తే దాంపత్య జీవితానికి బీటలు వారతాయి. ఏదో రోబోల్లాగా జీవితం సాగిపోతుంది. అందుకే ఈ టిప్స్ పాటించండి...

Relationship Tips: ఉదయాన్నే శృంగారం.. ఆలూమగలు మధ్య దూరం మటుమాయం
Relationship Tips

Updated on: Jun 13, 2024 | 5:56 PM

ఈ జనరేషన్ అంతా ఉరుకుల, పరుగుల జీవితం గడిపేస్తున్నారు. రోజంతా బిజీ బిజీ.. ఆలూమగలు ఒకరితో.. ఒకరు గడిపే సమయం చాలా తక్కువ అయిపోయింది. ఈ తీరక లేని వర్క్ షెడ్యూల్ కపుల్స్ మధ్య రిలేషన్ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొత్త జంటలు.. ఒకరిపై ఒకరు అవగాహన ఏర్పరచుకోకపోవడమే.. విడాకులకు దారితీస్తుందని అంటున్నారు. రోజంతా కేటాయించమని ఎవరూ అడగరు. కనీసం.. ఉదయాన్నే కొన్ని పనులతో ఒకరికొకరు మరింత దగ్గర కావొచ్చు.

 

  • పొద్దున్నే లేవగానే.. హడావిడిగా పనుల్లోకి వెళ్లకుండా.. కాఫీ తాగుతూ ఓ 10 నిమిషాలు ప్రేమగా మాట్లాడితే.. ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది.
  • అలాగే పనుల్నీ అర్థాంగిపైనే వేయకుండా… ఒకరి కోసం ఒకరు కొన్ని పనులు చేసుకుంటే బెటర్. ఉదాహరణకు.. టీ లేదా కాఫీ చేసి ఇవ్వడం, టిఫిన్ రెడీ చేయడం, జాబ్స్ చేసే వారైతే ఒకరి లంచ్‌ బాక్సుల్ని మరొకరు రెడీ చేయడం.. ఇలా ఒకరి కోసం ఒకరు చేసే పనులు తెలియకుండానే దూరం మాయమవుతుంది
  • మీ పార్టనర్ మీకోసం పెట్టిన కాఫీ రెగ్యులరే అయినా, టిఫిన్ రుచిగా ఉన్నా లేదంటే తను వేసుకున్న డ్రస్‌ బాగున్నా.. ఇలా ఏ విషయంలోనైనా ఓ కాంప్లిమెంట్ ఇవ్వండి. ఇలాంటి ప్రశంసలు ఇద్దరినీ మరింత చేరువ చేస్తాయి. తద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు. మర్చిపోకండి ప్రపంచం అంతా ప్రశంస చుట్టూనే తిరుగుతుంది.
  • దాంపత్య జీవితంలో క్లోజ్‌నెస్ పెరగాలంటే ఇద్దరూ కలిసి కాసేపు జోక్స్‌ వేసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఉదయాన్నే ఇలా చేయడం వల్ల ఆ జోష్‌ రోజంతా ఇద్దరిలో ట్రావెల్ అవుతుంది.
  • ఒక్క ఫోన్ కాల్..ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలను పెంచుతుంది. మధ్యాహ్నం ఫోన్ చేసి.. తిన్నావా అని అడిగితే చాలు.. వెన్నలా హృదయాలు కరిగిపోతాయి. అలానే వీకెండ్ అయితే.. ఆ కాల్ చేసినప్పుడు సాయంత్రం బయటకు వెళ్దాం అని ఒక్కమాట చెప్పండి. ఇక మీపై కురిపించే ప్రేమకు హద్దులే ఉండవు
  • భార్యభర్తలిద్దరూ కలిసి చేసే వ్యాయామాలూ వారి మధ్య రిలేషన్‌ను రెట్టింపు చేస్తాయని పలు రీసెర్చ్‌లు చెబుతున్నాయి. ఈక్రమంలో ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా మాట్లాడుతూ వర్కవుట్‌ చేయడం వల్ల అందులో అలసట తెలియకపోగా.. మంచి మధురానుభూతినీ సొంతం చేసుకోవచ్చు.
  • ఆలుమగలిద్దరూ మరింత దగ్గరవ్వాలంటే అందులో శృంగారం పాత్ర చాలా ముఖ్యమైనది. అది కూడా ప్రత్యేకించి ఉదయం పూట చేయడం వల్ల మనసు రీఛార్జ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఆ రోజంతా చేసే ఇతర పనుల పైనా కాన్సన్‌ట్రేషన్ పెరుగుతుందంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..