
ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఊబకాయంతోపాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన వంటింట్లో దొరికే అద్భుతమైన ఔషధ గుణాలున్న పదార్థాలను ఉపయోగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి వాటిలో.. మన వంటింట్లో సులభంగా దొరికే మసాలా దినుసుల్లో జీలకర్ర (Cumin Seeds) ఒకటి.. కేవలం వంటలకు రుచి, సువాసన అందించడమే కాకుండా, ఆయుర్వేదంలో దీనికి గొప్ప ఔషధ స్థానం ఉంది. జీలకర్రలో విటమిన్ A, C, ఫైబర్ (పీచు పదార్థం), అనేక రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో లేదా ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
జీర్ణశక్తి మెరుగుదల, అసిడిటీ నివారణ: జీలకర్ర నీరు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, తేన్పుల వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
బరువు తగ్గేందుకు (Weight Loss): శరీరంలోని అనవసరమైన కొవ్వును (Belly Fat) కరిగించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
కిడ్నీలో రాళ్లు కరిగించడం: జీలకర్ర నీటిని నిరంతరం తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉండే రాళ్లు నెమ్మదిగా కరిగిపోవడానికి సహాయపడుతుంది.
చక్కెర స్థాయిల నియంత్రణ (Diabetes): ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తూ, షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది.
పైల్స్ (Piles) సమస్య ఉపశమనం: ఇందులోని అధిక ఫైబర్ పరిమాణం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. దీనివల్ల పైల్స్ సమస్యతో బాధపడేవారికి మంచి ఉపశమనం లభిస్తుంది.
చర్మ సౌందర్యం – జుట్టు పెరుగుదల: ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గించి చర్మానికి ప్రకాశవంతమైన మెరుపుని ఇస్తుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరగడానికి తోడ్పడుతుంది.
గుండె ఆరోగ్యం – బిపి అదుపు: రక్తపోటును నియంత్రణలో ఉంచి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చిన్న పిల్లల్లో సమస్యలు: పిల్లలకు రోజూ ఒక స్పూన్ జీలకర్ర నీటిని పట్టించడం వల్ల వారిలో వచ్చే కడుపునొప్పి, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి.
ఒక పాత్రలో ఒక గ్లాసు నీటిని తీసుకుని, అందులో రెండు టీస్పూన్ల జీలకర్ర వేయాలి.
ఈ నీటిని మీడియం మంటపై దాదాపు 5 నిమిషాల పాటు మరిగించాలి.
నీరు రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
నీరు గోరువెచ్చగా మారిన తర్వాత వడకట్టి, ఒక గ్లాసులోకి తీసుకోవాలి.
బరువు తగ్గాలనుకునే వారు లేదా మరింత మంచి ఫలితాల కోసం ఇందులో అరచెక్క నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే పరగడుపున (టిఫిన్ చేయడానికి ముందు) తాగాలి.
అయితే, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచన తీసుకోవడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..