
ప్రూన్స్ తింటే మలబద్ధకం తగ్గుతుంది. ఇది పేగు ఆరోగ్యానికి మంచిది. పాలీఫెనల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువగా ఉంటుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర తక్కువ అవుతుంది. డయాబెటీస్ వారికి కూడా మంచిది. ప్రూన్స్‌లో విటమిన్ కే, బోరాన్, పొటాషియం ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యం, జీర్ణ ఆరోగ్యం కూడా.
ప్రూనే.. అంటే ఎండిన ప్లమ్ పండ్లు. ఇవి తినడానికి తియ్యగా, రుచిగా ఉంటాయి. ప్రూన్స్‌లో ఫైబర్, విటమిన్ k, విటమిన్ A, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి ప్రూనే అద్బతంగా తోడ్పడుతుంది. మీ బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.
ప్రూనేలో కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి తోడ్పడతాయి. ప్రూనేలో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ప్రూనే తినడం వల్ల రక్తం వేగంగా పునరుత్పత్తి అవుతుంది. కొత్త రక్తం ఆక్సిజన్‌ను బాగా ప్రసరింపజేస్తుంది. రక్త ప్రసరణ పెరగడం అలసటను నివారిస్తుంది. శక్తిని పెంచుతుంది. ఖర్జూరా కంటే ప్రూనేలో కొంచెం ఎక్కువ ఇనుము ఉంటుంది.
ఈ ప్రూనే పండ్లు పండ్లు సహజ చక్కెరలతో సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కేలరీలను కలిగి ఉంటాయి. అవి విటమిన్ K, విటమిన్ B6, నియాసిన్, రిబోఫ్లేవిన్ లకు కూడా మంచి మూలం. మీరు తీవ్రమైన అలసటతో బాధపడుతుంటే, ఈ పండ్లు తినటం వల్ల మీ అలసట కొద్ది సమయంలోనే మాయమవుతుంది. ఇంకా మలబద్ధకం, మూత్ర సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.