Alcohol: మద్యంలో సోడా లేదా కూల్‌డ్రింక్ మిక్స్ చేసి తాగుతున్నారా.? పెను ప్రమాదమే.. తస్మాత్ జాగ్రత్త!

'మద్యపానం ఆరోగ్యానికి హానికరం', 'మద్యం సేవిస్తే.. జీవితం నాశనం' అంటూ కొటేషన్లు ఎన్ని చెప్పినా..

Alcohol: మద్యంలో సోడా లేదా కూల్‌డ్రింక్ మిక్స్ చేసి తాగుతున్నారా.? పెను ప్రమాదమే.. తస్మాత్ జాగ్రత్త!
Liquor Side Effects

Updated on: Sep 13, 2022 | 4:56 PM

‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’, ‘మద్యం సేవిస్తే.. జీవితం నాశనం’ అంటూ కొటేషన్లు ఎన్ని చెప్పినా.. మద్యంప్రియులు అస్సలు పట్టించుకోరు. అధిక మోతాదులో తాగుతూ.. మత్తులో తులుతుంటారు. ఇదిలా ఉంటే.. మద్యం తాగితేనే రిస్క్..అయితే అందులోనూ కొంతమంది మద్యంలో సోడా లేదా కూల్‌డ్రింక్ మిక్స్ చేసుకుని తాగుతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని.. పలు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.

మద్యంలో సోడా మిక్స్ చేస్తే..

మద్యంలో సోడా మిక్స్ చేసుకుని తాగితే.. మన శరీరంలోని కార్బన్ డైఆక్సైడ్ రక్తంలో వేగంగా కరిగిపోతుందని.. అలాగే దీని ఆమ్లం శరీరంలోని కాల్షియంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. కాల్షియం కరిగిపోవడం వల్ల ఎముకలు బలహీనపడటం, ఎముకుల్లో పగుళ్లు లాంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు.

మద్యంలో కూల్‌డ్రింక్స్ కలిపి తాగితే..

కొందరు ఆల్కహాల్‌లో కూల్‌డ్రింక్స్ మిక్స్ చేసి తాగుతుంటారు. అలా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. ఆల్కహాల్, శీతల పానీయాలలో చక్కెర ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింతగా దిగజారుతాయి. అలాగే అనేక శీతల పానీయాలలో కెఫిన్ కూడా ఉంటుంది. అది శరీరాన్ని ఉత్తేజపరిస్తే.. ఆల్కహాల్‌ శరీరాన్ని నీరసింపజేస్తుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తవచ్చు. అందుకే ఈ రెండింటిని కలిపి మిక్స్ చేయొద్దు.

గమనిక: ఈ వార్త కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురించబడింది. పలు అధ్యయనాలు, జర్నల్స్‌ ఆధారంగా రాసినది. మీ జీవనశైలిలో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే.. తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి.