AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్‌స్క్రీన్ వాడితే విటమిన్ డి లోపం వస్తుందా..? అసలు నింజమేంటి? వైద్యులు ఏమంటున్నారు?

అందంగా కనిపించాలని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని అందరూ అనుకుంటారు. ఇందుకోసం రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా బయటకు వెళ్లే ముందు ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకునేందుకు అందరూ సన్‌స్క్రీన్ వాడుతూ ఉంటారు. అయితే చాలా మంది ఇది మన శరీరానికి అవసరమైన విటమిన్ డి అందకుండా చేస్తుందని అనుకుంటారు. కాబట్టి దీనిలో నిజమెంత, వైద్యులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సన్‌స్క్రీన్ వాడితే విటమిన్ డి లోపం వస్తుందా..? అసలు నింజమేంటి? వైద్యులు ఏమంటున్నారు?
Sunscreen Vitamin D Deficiency
Anand T
|

Updated on: Feb 06, 2026 | 6:29 PM

Share

ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని పొందడానికి మనం రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తాం. అలాంటి వాటిలో సన్‌స్క్రీన్ కూడా ఒకటి. చాలా మంది ఇది లేకుండా బయటకు వెళ్లరు. సూర్యుని అతినీలలోహిత (UV) కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ చాలా అవసరం. ఎండలో బయటకు వెళ్ళే ముందు సన్‌స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఇది మన చర్మాన్ని రక్షిస్తుంది. అధిక టానింగ్, చర్మంపై నల్లటి మచ్చలు, సూర్యకాంతి వల్ల కలిగే అకాల వృద్ధాప్యాన్ని నివారించడానికి మాత్రమే కాకుండా, ప్రాణాంతక చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గింస్తుంది.

అయితే సన్‌స్క్రీన్ వాడడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ డి అందకుండా పోతుందని చాలా మందిలో ఒక అపోహ ఉండిపోయింది. కానీ నిజం ఏమిటంటే చాలా మంది తమ చర్మంపై UVB కిరణాలను పూర్తిగా నిరోధించడానికి తగినంత సన్‌స్క్రీన్‌ను ఉపయోగించరు. సిఫార్సు చేసిన దానికంటే తక్కువ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించడం వల్ల సూర్యకాంతి చర్మాన్ని చేరుతుంది. అలాగే సన్‌స్క్రీన్‌ను క్రమం తప్పకుండా తిరిగి అప్లై చేయాలి. కానీ చాలా మంది ఇలా చేయరు, కాబట్టి శరీరానికి విటమిన్ డి ఉత్పత్తి చేయడానికి తగినంత సూర్యకాంతి లభిస్తుంది.

మరో విషయం ఏమిటంటే, చాలా మంది తమ శరీరంలోని అన్ని భాగాలకు సన్‌స్క్రీన్ రాసుకోరు. ముఖం, చేతులకు మాత్రమే అప్లై చేసినప్పుడు, విటమిన్ డి శరీరంలోని ఇతర భాగాలకు అందుతుంది. సన్‌స్క్రీన్ ఉపయోగించినప్పటికీ, చర్మం సహజంగానే అవసరమైన మేర విటమిన్ డి ఉత్పత్తి చేయడానికి అవసరమైన సూర్యకాంతిని పొందుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సన్‌స్కీన్ వల్ల మన శరీరంలో విటమిన్ డి లోపం పెరుగుతుందనే అపోహ మాత్రమే

విటమిన్ డి లోపానికి ప్రధాన కారణాలు

  • మీరో ఎక్కువ సమయం ఆఫీస్‌లో గడపడం వల్ల మీరు పూర్తి స్థాయిలో సూర్యరశ్మిని పొందలేరు.
  • మన శరీరానికి విటమిన్ డి సహజంగా లభించే ప్రధాన వనరు ఉదయం సూర్యకాంతి. మీరు దీనిని పొందకపోతే మీలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది.
  • వయసు పెరిగే కొద్దీ, సూర్యకాంతి నుండి విటమిన్ డిని ఉత్పత్తి చేసే చర్మ సామర్థ్యం సహజంగా తగ్గుతుంది.
  • మీరు ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే గుడ్డులోని పచ్చసొన, కొవ్వు చేపలు, పాల ఉత్పత్తులు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహార పదార్థాల తీసుకోండి. వీటిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరానికి అవసరమైన విటమిన్ డిను అందిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?