గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం తాగే అలవాటు మీకూ ఉందా?

ఫిట్‌నెస్ ప్రియులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మ రసం గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం తరచూ చూస్తుంటాం. దీనివల్ల కడుపులోని కొవ్వు తొలగిపోతుందని చాలా మంది భావిస్తుంటారు. ఈ పురాతన చిట్కా పలు ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుందని నమ్ముతారు. అయితే ఈ చిట్కా నిజంగా పనిచేస్తుందా? లేదా శరీరానికి విషంగా మారుతుందా? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం తాగే అలవాటు మీకూ ఉందా?
Lemon Water On An Empty Stomach

Updated on: Jan 22, 2026 | 9:02 PM

ప్రతి ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం కలిపి తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులను దూరంగా ఉంచుతుంది. నిమ్మకాయలోని అధిక విటమిన్ సి కంటెంట్ జలుబును నివారిస్తుంది. నిమ్మకాయలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది నరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. శరీర ఆమ్ల స్థాయిని నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. తరచుగా అనారోగ్యానికి గురికాకుండా రక్షణ కల్పిస్తుంది.

నిమ్మ నీరు దంత కుహరాలు, పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి వంటి దంత సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించగలదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మ నీరు తాగడం వల్ల మూత్రవిసర్జన సైతం మెరుగుపడుతుంది. ఇది శరీరం నుంచి విషాన్ని, వ్యర్థాలను తొలగిస్తుంది. అందువల్ల నిమ్మ రసం తాగడం వల్ల మెరిసే చర్మం పొందవచ్చు. ఇది జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో నిమ్మ నీరు తాగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అజీర్ణంతో బాధపడేవారికి ఈ నిమ్మ నీరు అద్భుతంగా పనిచేస్తుంది.

అయితే ఈ నిమ్మకాయ నీటిని తప్పుడు సమయంలో, తప్పుడు మార్గంలో తాగితే ఆరోగ్యానికి విషం మాదిరి ప్రతికూలంగా పని చేస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మ నీరు తాగడం అంత మంచిది కాదు. నిమ్మ నీరు తాగడం వల్ల దంతాల ఎనామిల్ దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నోటిలో పుండ్లు ఉంటే నిమ్మ నీటిని తాగడం వల్ల అవి మరింత తీవ్రతరం అవుతాయి.

ఇవి కూడా చదవండి

విషప్రయోగం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం మంచిది. తాగిన వెంటనే పళ్ళు తోముకోకూడదు. రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు నిమ్మ నీరు తాగకూడదు. ఈ నీటిని నేరుగా తాగడం కంటే స్ట్రా ద్వారా తాగడం వల్ల ఎనామిల్ సురక్షితంగా ఉంటుంది. అల్సర్లు లేదా తీవ్రమైన అసిడిటీ ఉంటే ఈ నీళ్లు అస్సలు తాగకూడదు. అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం మరచిపోకూడదు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.