Weekend Marriage: వారంతపు వివాహం అంటే ఏంటో మీకు తెలుసా? వీకెండ్‌ మ్యారేజ్‌తో ఇవే లాభాలంటా..

పెళ్లంటే నూరెళ్ల పంట. కానీ ఈ మధ్య చాలా మంది పెళ్లెందుకు దండగ అంటున్నారు. సోలో లైఫ్ సో బెటర్ అంటూ సింగిల్ లైఫ్ కే ఓటేస్తున్నారు. పెళ్లి చేసుకుంటే ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ మోయడం  తమ వాళ్ల కాదని చేతులెత్తుస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లి అనే...

Weekend Marriage: వారంతపు వివాహం అంటే ఏంటో మీకు తెలుసా? వీకెండ్‌ మ్యారేజ్‌తో ఇవే లాభాలంటా..
ఆహారం, సెక్స్ మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైనవి.. లైంగిక జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవాలంటే కొన్ని ఆహార పానీయాలను తీసుకోవాలి. ఇవి, మహిళలు, పురుషుల్లో కామోద్దీపనలు- లైంగిక కోరికలను పెంచడంతోపాటు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

Edited By: Narender Vaitla

Updated on: Feb 22, 2023 | 1:32 PM

పెళ్లంటే నూరెళ్ల పంట. కానీ ఈ మధ్య చాలా మంది పెళ్లెందుకు దండగ అంటున్నారు. సోలో లైఫ్ సో బెటర్ అంటూ సింగిల్ లైఫ్ కే ఓటేస్తున్నారు. పెళ్లి చేసుకుంటే ఎన్నో బరువు బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ మోయడం  తమ వాళ్ల కాదని చేతులెత్తుస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే పెళ్లి అనే ఈ సంసార సాగరాన్ని ఈదడం అంత ఈజీ కాదని కొట్టిపారేస్తున్నారు. అయితే రోజూ కాకుండా భార్యాభర్తలుగా కేవలం వారానికి ఒకసారి మాత్రమే కలిసి ఎలా ఉంటుంది. కేవలం వారంతంలోనే కాపురం చేయడం. అంటేవారానికి ఒకరోజు మాత్రమే సంసార బాధ్యతలను పంచుకోవడం. ఇదంత ఆలోచిస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది కదూ. అవును నిజమే…ఈ వారంతరపు పెళ్లి చేసుకుంటే కేవలం వారంతంలోనే భార్యాభర్తలుగా, మిగతా వారమంతా సోల్ లైఫ్‎ను ఎంజాయ్ చేస్తూ గడపవచ్చు. ఇప్పుడు వారంతపు పెళ్లిళ్లు అనేవి ట్రెండ్‎గా మారింది.

అసలు ఈ వీకెండ్ మ్యారెజ్ అనే కాన్సెప్ట్ ఎలా ప్రారంభమైంది. ఎక్కడ మొదలైంది. దీనివల్ల ఏంటి లాభం. తెలుసుకుందాం.

వారంతపు పెళ్లి అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

వారంతపు పెళ్లి అనేది ఇండియాలో మొదలైన కాన్సెప్టు కాదు. .ఈభావన జపాన్ దేశంలోన జంటల్లో పెరుగుతోన్న ధోరణి. ఇక్కడ వివాహమైన జంటలు కలిసి సమాయాన్ని గడిపేందుకు వారంతం వరకు వేచి ఉంటారు. ఆ వీకెండ్ లోనే ఇద్దరు భార్యభర్తలుగా జీవిస్తారు. మిగతా వారం రోజులు ఎవరి స్వేఛ్చ వారిది.

అయితే ఈ జీవన విధానం ఖచ్చితంగా సవాళ్లతో కూడుకున్నది. అయితే ఈ వారంతపు వివాహం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కొన్ని జంటలకు వారంతపు విహహం ఏర్పాటు గురించి 5 ఆశ్చర్యకరమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

మీకు కావాల్సిన సమయం దొరకుతుంది:

ఈ వారంతపు జీవనశైలిలో అత్యంత సులభమైన ప్రయోజనం ఏంటంటే..ప్రతిభాగస్వామికి తమకావాల్సిన సమయం దొరకుతుంది. మీ భాగస్వామి వారి స్వతంత్రతను ఇష్టపడితే..వారి స్వంత దినచర్యలను కలిగి ఉండాల్సిన అవసరం ఉంటే.మీ కోసం పనిచేస్తుంది. మీ పనివారంలో మీరు మీ భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన లేకుండా మీ అభిరుచులు, ఆసక్తులు, సామాజిక కార్యకలాపాలను కొనసాగించడానికి మీకు అవకాశం ఉంటుంది.

ఎలాంటి గొడవలు ఉండవు:

భార్యభర్తల మధ్య తరచుగా గొడవులు అనేది సర్వసాధారణం. చిన్నచిన్న విషయాలకే గొడవలు పడుతుంటారు. అయితే ఈ పరిస్థితులను నివారించడానికి ఈ వారంతపు వివాహం సహాయపడుతుంది. మీరు కలిసి గడిపే తక్కువ సమయం…వాదనలు, విభేదాలకు తావు లేకుండా ఉంటుంది. ఇద్దరూ శాంతియుతంగా ఉండే సంబంధానికి దారి తీస్తుంది. మీరు వారాంతాల్లో మాత్రమే గడిపే సమయం మీకు మరింత సానుకూలంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది.

సరదాగా ఉంటుంది:

వారంతాల్లోకలిసి గడిపిన కొద్ది సమయం…వారంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాడినికి అద్భుతమైన అవకాశం. ఇద్దరు కలుసుకోవడం సరదాగా ఉంటుంది. ఎందుకంటే భాగస్వాములు తమ సమయంలో తాము చేసిన ఖర్చులన్నింటిని వేరుగా పంచుకుంటారు. సమయాన్ని మరింత సరదాగా మార్చుకోవాలంటే…వారాంతంలోఏదైనా ఈవేంట్ కు ప్లాన్ చేయండి. మీరు మీ భాగస్వామిని ప్రేమించేలా చేసుకోండి. ప్రేమానురాగాలు పెంపోదించడానికి ఇదే గొప్ప అవకాశం.

సర్ ప్రైజ్ చేయడం:

తక్కువ సమయంలో మీరు రెట్టింపు ఉత్సాహంతో ఉండవచ్చు. మీ భాగస్వామిని ఆకస్మిక తేదీలు, రొమాంటిక్ హావభావాలు ఇలా సర్ ప్రైజ్ చేసేందుకు ఇది సరైన సమయం. ఈ వారంతపు వివాహం సంబంధాన్ని తాజాగా, ఉత్సాహంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇది చాలా విలువైంది:

కొంతమంది జంటల్లు కలిసి జీవిస్తున్నప్పుడు ఒకరి గురించి ఒకరు పెద్దగా పట్టించకోరు. ఇది చాలా జంటల్లో గొడవలకు దారి తీస్తుంది. భాగస్వామిని ప్రేమించడం, ప్రశంసించడం, ఆప్యాయత చూపించడం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ న్యూస్‌ కోసం క్లిక్‌ చేయండి..