పురుషుల కంటే మహిళలకే ఎక్కువ నిద్ర అవసరం..? సైన్స్ ఏం చెబుతోందంటే!

ఆరోగ్యకరమైన జీవనశైలికి సమతుల్యమైన ఆహారం ఎంత ముఖ్యమో, నాణ్యమైన నిద్ర కూడా అంతే అవసరం. అయితే, సాధారణంగా అందరికీ 7 నుండి 8 గంటల నిద్ర సరిపోతుందని భావిస్తుంటారు. కానీ, శాస్త్రీయ పరిశోధనల ప్రకారం, పురుషుల కంటే మహిళలకు ప్రతిరోజూ అదనంగా 20 నుండి 30 నిమిషాల ఎక్కువ నిద్ర అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి గల ముఖ్యమైన కారణాలు, ఆరోగ్య నిపుణుల అభిప్రాయాలను ఇక్కడ తెలుసుకుందాం.

పురుషుల కంటే మహిళలకే ఎక్కువ నిద్ర అవసరం..? సైన్స్ ఏం చెబుతోందంటే!
Why Women Need More Sleep

Updated on: Aug 14, 2026 | 6:45 PM

ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రలో శరీరానికి, మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. దీనివల్ల శరీరం వివిధ పనుల కోసం శక్తిని నిలుపుకుంటుంది. ప్రతి వ్యక్తికి వేర్వేరు నిద్ర అవసరాలు ఉంటాయి. వయస్సు, శారీరక కార్యకలాపాలు, శరీర కదలికలను బట్టి నిద్ర అవసరాలు మారుతూ ఉంటాయి. మహిళలు, పురుషుల నిద్ర అవసరాలు కూడా భిన్నంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరం. శారీరక, మానసిక మార్పుల వల్ల కూడా మహిళల నిద్ర ప్రభావితమవుతుంది. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర అవసరం. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

మల్టీటాస్కింగ్, మెదడు వినియోగం: మహిళలు సహజంగానే ఒకే సమయంలో అనేక పనులు చేసే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఇల్లు, ఉద్యోగం, పిల్లల సంరక్షణ ఇలా ఒకేసారి అనేక విషయాలపై దృష్టి సారిస్తారు. ఈ క్రమంలో వారి మెదడు పురుషుల కంటే ఎక్కువగా శ్రమిస్తుంది. మెదడు ఎంత ఎక్కువగా పని చేస్తే, అది తిరిగి ఉత్తేజితం కావడానికి అంత ఎక్కువ విశ్రాంతి, నిద్ర అవసరమవుతాయి.

హార్మోన్ల మార్పులు: మహిళల శరీరంలో జీవితంలోని వివిధ దశల్లో తీవ్రమైన హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి. నెలవారీ పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పులు, మూడ్ స్వింగ్స్ నిద్రకు భంగం కలిగిస్తాయి. గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే మార్పులు, శారీరక అలసట వల్ల ఎక్కువ నిద్ర అవసరం. అలాగే, మెనోపాజ్.. ఈ దశలో నైట్‌ స్వెట్, వేడి ఆవిర్లు రావడం వల్ల నిద్రలేమి సమస్య పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మానసిక ఒత్తిడి, ఆందోళన: పరిశోధనల ప్రకారం, పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆందోళన, డిప్రెషన్, మానసిక ఒత్తిడి ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒత్తిడి వల్ల నిద్ర నాణ్యత తగ్గి, రాత్రి వేళల్లో పదేపదే మెలకువ వస్తుంటుంది. ఈ లోటును పూడ్చుకోవడానికి ఎక్కువ సమయం పడుకోవాల్సి వస్తుంది.

తగినంత నిద్ర లేకపోతే ఏమవుతుంది?: మహిళలకు తగినంత నిద్ర లభించకపోతే గుండె జబ్బులు, మధుమేహం, బరువు పెరగడం, నిరాశ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అందుకే మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజువారీ పని ఒత్తిడిని తగ్గించుకుని, క్రమబద్ధమైన నిద్ర వేళలను పాటించడం ఎంతో ముఖ్యం!

మంచి నిద్ర కోసం ఏం చేయాలి?:

మంచి నిద్ర కోసం, పడుకునే, మేల్కొనే సమయాన్ని స్థిరంగా పెట్టుకోండి. రాత్రి పడుకునే ముందు మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను ఉపయోగించవద్దు. రాత్రిపూట గదిలో లైట్లను మసకగా ఉంచండి. సాయంత్రం టీ, కాఫీ లేదా ఇతర కెఫిన్ పానీయాలు తాగవద్దు. మీ శరీరాన్ని వీలైనంత చురుకుగా ఉంచడానికి ప్రయత్నించండి. పగటిపూట అలసటగా అనిపిస్తే, వైద్యుడిని సంప్రదించండి. పగటిపూట కునుకు తీయకుండా ప్రతి రాత్రి 8 గంటల నిద్ర పొందడానికి ప్రయత్నించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us