Kitchen Hacks: కూరలో పులుపు ఎక్కువైందా.. తగ్గాలంటే ఇలా చేయండి..

కూరలు కమ్మగా ఉంటే ఖచ్చితంగా ఓ రెండు ముద్దలు ఎక్స్‌ట్రా తింటారు. అందులోనూ తమకు నచ్చిన కూరలు అయితే మరింత ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కూరలు ఎప్పుడూ ఒక్కేలా కుదరవు. ఒక్కోసారి చాలా రుచిగా వస్తాయి. మరొకసారి మాత్రం అస్సలు బాగోవు. ఎంత మంచిగా వండినా.. ఉప్పు లేదా కారం, పులుపు వంటివి ఎక్కువ అవుతాయి. అయితే కూరలో కాస్త కారం ఎక్కువగా ఉన్నా తినేస్తారు. కానీ పులుపు ఎక్కువైతే మాత్రం..

Kitchen Hacks: కూరలో పులుపు ఎక్కువైందా.. తగ్గాలంటే ఇలా చేయండి..
Kitchen Hacks
Follow us

|

Updated on: Aug 05, 2024 | 3:04 PM

కూరలు కమ్మగా ఉంటే ఖచ్చితంగా ఓ రెండు ముద్దలు ఎక్స్‌ట్రా తింటారు. అందులోనూ తమకు నచ్చిన కూరలు అయితే మరింత ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కూరలు ఎప్పుడూ ఒక్కేలా కుదరవు. ఒక్కోసారి చాలా రుచిగా వస్తాయి. మరొకసారి మాత్రం అస్సలు బాగోవు. ఎంత మంచిగా వండినా.. ఉప్పు లేదా కారం, పులుపు వంటివి ఎక్కువ అవుతాయి. అయితే కూరలో కాస్త కారం ఎక్కువగా ఉన్నా తినేస్తారు. కానీ పులుపు ఎక్కువైతే మాత్రం అస్సలు ఎవరూ తినరు. దీంతో ఆ కూరల్ని పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు చెప్పే కొన్ని చిట్కాలు ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. కూరల్లో పులుపు ఎక్కువైతే ఏం చేయాలో చాలా మందికి తెలీదు. అందుకే మీ కోసం స్పెషల్‌గా ఈ టిప్స్ తీసుకొచ్చాం. మరి కూరల్లో పులుపు తగ్గించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

తీపి కలపండి:

కూరల్లో పులుపు ఎక్కువైతే బ్యాలెన్స్ చేయడానికి తీపి చక్కగా ఉపయోగ పడుతుంది. పులుపును తగ్గించడానికి తేనె లేదా చక్కెర, బెల్లం కానీ వేయండి. తీపి వేసిన తర్వాత మరొకసారి రుచి చూడండి. పులుపు ఎక్కువగా ఉంటే కొద్దిగా బెల్లం లేదా పంచదార వేయవచ్చు. కావాలి అనుకునేవారు బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.

ఈ కూరగాయలు కలపండి:

కూరలో పులుపును తగ్గించడానికి కూరగాయలు కూడా చక్కగా హెల్ప్ చేస్తాయి. బంగాళ దుంపలు, క్యారెట్లు, బటానీలు వంటి వాటిని కూరలో వేయండి. ఇలా చేయడం వల్ల పులుపు తగ్గడమే కాకుండా రుచి కూడా పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

కొబ్బరి పేస్ట్:

కూరల్లో ఉండే పులుపును తగ్గించడంలో కొబ్బరి పేస్ట్ కూడా చక్కగా సహాయ పడుతుంది. ఇది పులుపును తగ్గించడమే కాకుండా రుచిని కూడా పెంచుతాయి. కొబ్బరి ముక్కలను సన్నగా కట్ చేసి పేస్టులా చేసి వాడండి. కొబ్బరి పొడి ఉన్నా కూడా వేయవచ్చు. అంతే కాకుండా జీడిపప్పు, బాదం, గసగసాలు, కొబ్బరి కలిపి పేస్టులా కూరలో వేయవచ్చు. దీని వల్ల కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుంది.

బేకింగ్ సోడా:

కూరలో పులుపు తగ్గించడానికి బేకింగ్ సోడా కూడా యూజ్ అవుతుంది. మరీ ఎక్కువగా కాకుండా చిటికెడు వేస్తే చాలు. ఎక్కువగా వేస్తే కూర రుచి మొత్తం పాడవుతుంది. బేకింగ్ సోడా వేశాక.. కొద్దిసేపు ఉడికించి దించేయాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..