ఈ పండు రోజూ తింటే ఒంట్లో కొలెస్ట్రాల్‌ వేగంగా కరిగిపోతుంది

05 August 2024

TV9 Telugu

TV9 Telugu

నేటి గజిబిజి జీవనశైలి కారణంగా ఎక్కువగా బయటి ఆహారం చేయాల్సి వస్తోంది. ప్రమాదకర ఆయిల్ మసాలాలతో కూడిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోతుంది

TV9 Telugu

ఆ కొవ్వు వల్ల బరువు పెరగడమే కాదు.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా మరింత పెరుగుతుంది

TV9 Telugu

ఒంట్లో చెడు కొలెస్ట్రాల్‌ని గుర్తించిన తర్వాత రోజువారీ ఆహారంపై అధిక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మద్యపానం పూర్తిగా మానేయాలి

TV9 Telugu

అయితే రోజూ ఈ పండు తింటే మాత్రం సులభంగా చెడు కొలెస్ట్రాల్ శరీరం నుంచి తొలగిపోతుంది. అదే యాపిల్‌.. అవును యాపిల్‌ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో బలేగా పనిచేస్తుంది

TV9 Telugu

యాపిల్స్‌లో పెక్టిన్ అనే ప్రయోజనకరమైన ఫైటోస్టెరాల్ సమ్మేళనం ఉంటుంది. ఇందులో వివిధ రకాల ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి

TV9 Telugu

పెక్టిన్, పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా యాపిల్ కడుపు జీర్ణ శక్తిని పెంచడానికి సహాయపడుతుంది

TV9 Telugu

రెండు మధ్య తరహా ఆపిల్స్ చెడు కొలెస్ట్రాల్‌ను 10 శాతం వరకు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు సైతం పెరుగుతాయట

TV9 Telugu

కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ కాకుండా, యాపిల్స్‌లో ఉండే కరిగే ఫైబర్ కూడా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక యాపిల్ తినడం చాలా మంచిది