తాజాగా ఐఆర్‌సీటీసీ కర్ణాటక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. కాఫీ విత్ కర్ణాటక పేరుతో ట్రావెల్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
మొత్తం 6 రోజుల పాటు కొనసాగే ఈ ట్రిప్ కు కంఫర్ట్ (3ఏ) క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ. 38000/-, డబుల్ షేరింగ్ 29600/-, ట్రిపుల్ షేరింగ్ రూ.27750/-,గా ఉంది.
5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.23950/- , బెడ్ లేకుండా రూ. 19550/-, 2-4 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా రూ.16400/- గా నిర్ణయించారు.
తొలిరోజు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడ నుండి మైసూరుకు చేరుకొని మైసూర్ ప్యాలెస్,బృందావన గార్డెన్ చూసి రాత్రికి బస మైసూరులోనే చేస్తారు.
రెండవరోజు శ్రీ రంగ నాథ,చెలువ నారాయణ స్వామి దేవాలయాలు దర్శినం ఉంటుంది. మూడవ రోజు టిబెటన్ మొనాస్టరీ, నిసర్ఘధామ చూస్తారు.
నాలుగవ రోజు కావేరి జన్మస్థలం, భాగమండల దేవాలయం దర్శించుకుంటారు. ఐదవ రోజు సక్లేష్ పూర్ చేరుకుని మంజీరాబాద్ ఫోర్ట్ చూసి హసాన్‌కు బయల్దేరాలి.
ఆరవ రోజు బేలూర్ సమీపంలోని చెన్నకేశవ, హోయసలేశ్వర దేవాలయలు దర్శించుకుని బెంగళూరుకు చేరుకోని తిరిగి హైదరాబాద్ కి చేరుకుంటారు.
ఈ టూర్ కోసం ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో ఎస్కార్ట్ సేవలు, ట్రావెల్ ఇన్సురెన్స్ సదుపాయం ఉంటుంది.