Yoga for Immunity: ఇమ్యూనిటీని పెంచే బెస్ట్ యోగాసనాలు ఇవే.. డోంట్ మిస్!

ఆరోగ్యంగా ఉండాలన్నా, పనులు చేయాలన్నా శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తి ఖచ్చితంగా కావాలి. రోగ నిరోధక శక్తి అనేది శరీరాన్ని కాపాడే రక్షణ వ్యవస్థ అని చెప్పెచ్చు. మనం తీసుకునే ఆహారంతోనే రోగ నిరోధక శక్తి అనేది శరీరానికి అందుతుంది. ఇతర రోగాలు త్వరగా ఎటాక్ చేయకుండా ఉండాలన్నా, వ్యాధులతో పోరాడే శక్తి లభించాలన్నా ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం కానీ రోగ నిరోధక శక్తి అనేది సజంగా ఎంత ఉంటే..

Yoga for Immunity: ఇమ్యూనిటీని పెంచే బెస్ట్ యోగాసనాలు ఇవే.. డోంట్ మిస్!
Yoga For Immunity
Follow us

|

Updated on: Aug 05, 2024 | 2:22 PM

ఆరోగ్యంగా ఉండాలన్నా, పనులు చేయాలన్నా శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తి ఖచ్చితంగా కావాలి. రోగ నిరోధక శక్తి అనేది శరీరాన్ని కాపాడే రక్షణ వ్యవస్థ అని చెప్పెచ్చు. మనం తీసుకునే ఆహారంతోనే రోగ నిరోధక శక్తి అనేది శరీరానికి అందుతుంది. ఇతర రోగాలు త్వరగా ఎటాక్ చేయకుండా ఉండాలన్నా, వ్యాధులతో పోరాడే శక్తి లభించాలన్నా ఇమ్యూనిటీ వ్యవస్థ బలంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం కానీ రోగ నిరోధక శక్తి అనేది సజంగా ఎంత ఉంటే.. శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో యోగా చక్కగా హెల్ప్ చేస్తుంది. యోగాతో ఎన్నో రకాల వ్యాధుల్ని నయం చేసుకోవచ్చు. తరచూ యోగా చేస్తూ ఉంటే దీర్ఘకాలిక వ్యాధులతో కూడా పోరాడే శక్తి లభిస్తుంది. సహజంగా యోగా ద్వారా కూడా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ యోగాసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాణ ముద్ర:

ప్రాణ ముద్ర వేయడం వల్ల కూడా శరీరంలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ప్రాణ సంజ్ఞగా పిలువబడే ఈ ముద్ర శరీరంలో నిద్రాణ శక్తిని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి ఈ ముద్ర వేయడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బల పడుతుంది.

అదితి ముద్ర:

రోగ నిరోధక శక్తిని పెంచడంలో అదితి ముద్ర కూడా చక్కగా పని చేస్తుంది. ఈ ముద్ర శరీర సహజ రక్షణను సమతుల్యం చేయడానికి సహాయ పడుతుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థను కూడా బలోపేతం చేయడంలో అదితి ముద్ర ప్రభావవంతంగా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

వజ్ర ముద్ర:

వజ్ర ముద్ర వేయడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయి. బరువును తగ్గించడంలో, ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఈ ముద్ర చక్కగా పని చేస్తుంది. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఈ ముద్ర తరచూ వేయడం వల్ల రక్త ప్రసరణను కూడా సమతుల్యం చేస్తుంది. మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఈ ముద్ర సహాయ పడుతుంది.

ఆది ముద్ర:

ఆది ముద్ర వల్ల కూడా శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి. నాడీ వ్యవస్థను శాంత పరిచి, ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా పని చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. శరీరంలో ఇమ్యూని వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ ముద్ర చక్కగా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ ముద్రలు ఉదయం లేదా సాయంత్రం సూర్యుని వెలుతురులో చేయాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..