వర్షాల ధాటికి విష జ్వరాలు నానాటికి ప్రభలుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే కొందరు మామూలు జ్వరంలే అని అశ్రద్ధ చేస్తుండటంతో పరిస్థితి విషమంగా మారుతుంది
TV9 Telugu
వర్షాకాలంలో డెంగ్యూ వైరస్, జికా వైరస్, మలేరియా, చండీపురా వైరస్ విపరీతంగా పెరుగుతాయి. ఈ సమయంలో పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలి
TV9 Telugu
అందుకే, జ్వరం ఒకరోజు కంటే ఎక్కువ ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు అంటున్నారు. ఒకవేళ జ్వరం 24 గంటల కంటే ఎక్కువ ఉంటే ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
వైరల్, ఫ్లూ ప్రధాన లక్షణం జ్వరం. దీనితోపాటు మరికొన్ని లక్షణాలు కూడా గమనిస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. అవగాహనతో ఉంటే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు
TV9 Telugu
వైరస్ లేదా ఫ్లూ ఉంటే జ్వరం కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. కానీ అధిక జ్వరం 24 గంటల కంటే ఎక్కువగా ఉంటే, జ్వరం కారణాన్ని తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేయించుకోవాలి. వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి
TV9 Telugu
వికారం, అలసట, మైకముతో కూడిన జ్వరం మూడవ రోజు వరకు ఉంటుంది. దీనికి తక్షణ చికిత్స అవసరం.102 ° C కంటే ఎక్కువ జ్వరం ఎక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులకు తక్షణ చికిత్స అవసరం
TV9 Telugu
అన్నింటికంటే ముందుగా శరీరాన్ని వీలైనంత హైడ్రేట్‌గా ఉంచడానికి తగినంత నీరు తాగాలి. నీరు, సూప్, కొబ్బరి నీళ్లు, పండ్ల రసం, ఎలక్ట్రోలైట్స్ మాత్రమే తాగించాలి
TV9 Telugu
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్, వైరల్ వాటికి యాంటీవైరల్ మందులు వాడాలి. తలనొప్పి, శ్వాస ఆడకపోవడం, వాంతులు వంటి ఇతర ఏవైనా అదనపు లక్షణాలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి