Lord Shiva: ఆలయంలో శివలింగం కనిపించకుండా గోడ కట్టేసిన ముగ్గురు మహిళలు.. రీజన్ వింటే షాక్ తినాల్సిందే..

ఈ ఘటన యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ సెంటర్ లోని రాజీవ్ ఆవాస్ యోజన బహుళ సమీపంలో ఒక శివాలయంలో చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న శివ లింగానికి భక్తులు రోజూ పూజలు చేస్తారు. యధాప్రకారం ఈ రోజు (సోమవారం) కూడా భక్తులు పూజ చేయడానికి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. శివలింగం కనిపించకుండా ఎవరో ఇటుకలతో, సిమెంటుతో కవర్ చేశారు.

Lord Shiva: ఆలయంలో శివలింగం కనిపించకుండా గోడ కట్టేసిన ముగ్గురు మహిళలు.. రీజన్ వింటే షాక్ తినాల్సిందే..
Lord Shiva Temple
Follow us

|

Updated on: Aug 05, 2024 | 3:18 PM

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ముగ్గురు మహిళలు వింత పని చేశారు. వీరు చేసిన పని గురించి తెలిసిన వారంతా ఉలిక్కిపడ్డారు. ముగ్గురు మహిళలు గ్రామ శివాలయంలోని శివ లింగాన్ని ఇటుకలు , సిమెంటుతో ముసి వేసే విధంగా ఒక నిర్మాణాన్ని నిర్మించారు. అంతేకాదు ఇలా శివలింగాన్ని ఇటుక, సిమెంటుతో ముసి వేసిన తరువాత రైలింగ్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఆలయం లోపలకు అడుగు పెట్టకుండా బయట నుండి లాక్ చేశారు. ఎప్పటిలా ఉదయమే శివాలయ దర్శనానికి వచ్చిన స్థానికులు ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు. దీంతో వీరు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసి.. ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఇద్దరు మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడో మహిళ ప్రస్తుతం పరారీలో ఉంది. నిర్బంధంలో ఉన్న ఓ మహిళ ఇలా శివలింగాన్ని మూసి వెయ్యడానికి గల కారణం చెప్పింది. అది విన్న పోలీసులు నుదిటిని పట్టుకున్నారు. మనుషుల్లో ఇప్పటికీ కూడా ఇంత మూఢనమ్మకాలున్నాయా అంటూ వ్యాఖ్యానించారు.

ఈ ఘటన యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటీ సెంటర్ లోని రాజీవ్ ఆవాస్ యోజన బహుళ సమీపంలో ఒక శివాలయంలో చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న శివ లింగానికి భక్తులు రోజూ పూజలు చేస్తారు. యధాప్రకారం ఈ రోజు (సోమవారం) కూడా భక్తులు పూజ చేయడానికి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. శివలింగం కనిపించకుండా ఎవరో ఇటుకలతో, సిమెంటుతో కవర్ చేశారు. దీంతో పాటు రెయిలింగ్‌కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. రెయిలింగ్ కు బయట నుంచి తాళం వేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగింది.

ఇవి కూడా చదవండి

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేయగా రాజీవ్ నివాసంలో నివసిస్తున్న కృష్ణ, విమల, సరితా అగర్వాల్ అనే ముగ్గురు మహిళలు సిమెంట్‌తో శివలింగం కనిపించకుండా గోడ కట్టేసినట్లు తేలింది. దీంతో పోలీసులు మహిళల ఇంటికి చేరుకోగా.. ఇద్దరు మహిళలు కృష్ణ, విమల పోలీసులకు దొరికిపోయారు. పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకుని వెళ్ళారు. ఇటుకలు, సిమెంటుతో శివలింగానికి తామే గోడ కట్టి కనిపించకుండా చేశామని పట్టుబడిన మహిళలు కృష్ణ, విమల అంగీకరించారు.

పెరుగుతున్న శివలింగం

ఇలా చేయడానికి గల కారణం కూడా విమల చెప్పింది. ఇలా చేయడం వలన శివలింగం పెరుగుతుందని.. తనకు కలలో శివుడు వచ్చి ఈ విషయాన్నీ చెప్పినట్లు తెలిపింది. శివుడి పట్ల భక్తి ఉన్న తాము శివయ్య కోరిక తీర్చడానికి సిమెంటు, ఇటుకలతో శివలింగమును కప్పాము. ఇక నుంచి దానంతట అదే పెరుగుతూనే ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని నోటీసుపై విడుదల చేశారు. కాగా మూడో మహిళ సరితా అగర్వాల్ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బౌలింగ్‌లో రోహిత్ శర్మ మ్యాజిక్.. ఖాతాలో ప్రత్యేక రికార్డ్..!
బౌలింగ్‌లో రోహిత్ శర్మ మ్యాజిక్.. ఖాతాలో ప్రత్యేక రికార్డ్..!
చికెన్ ప్రియులకు కిర్రాక్ న్యూస్.. ఈ నెల అంతా ఇంతే...
చికెన్ ప్రియులకు కిర్రాక్ న్యూస్.. ఈ నెల అంతా ఇంతే...
రియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ టీ ట్రై చేయండి..!
రియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కోసం ఈ టీ ట్రై చేయండి..!
ఇక్కడ నీరు తాగితే వ్యాధులు నయం శతాబ్దాలుగా ఎండిపోనినీరు ఎక్కడంటే
ఇక్కడ నీరు తాగితే వ్యాధులు నయం శతాబ్దాలుగా ఎండిపోనినీరు ఎక్కడంటే
సైనికపాలన దిశగా బంగ్లాదేశ్‌.. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా
సైనికపాలన దిశగా బంగ్లాదేశ్‌.. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా
మరికొన్ని గంటల్లోనే అమెజాన్‌ సేల్.. ఈ ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్
మరికొన్ని గంటల్లోనే అమెజాన్‌ సేల్.. ఈ ఫోన్‌లపై ఊహకందని డిస్కౌంట్
కూరలో పులుపు ఎక్కువైందా.. తగ్గాలంటే ఇలా చేయండి..
కూరలో పులుపు ఎక్కువైందా.. తగ్గాలంటే ఇలా చేయండి..
గౌతమ్ గంభీర్ వల్లే ఓడిన భారత్.. కొంపముంచిన ఆ 3 నిర్ణయాలు
గౌతమ్ గంభీర్ వల్లే ఓడిన భారత్.. కొంపముంచిన ఆ 3 నిర్ణయాలు
మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ.. వెనక నుంచి వచ్చిన ఓ దుండగుడు...
మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ.. వెనక నుంచి వచ్చిన ఓ దుండగుడు...
ఆలయంలో శివలింగం కనిపించకుండా గోడకట్టేసిన ముగ్గురు మహిళలు ఎందుకంటే
ఆలయంలో శివలింగం కనిపించకుండా గోడకట్టేసిన ముగ్గురు మహిళలు ఎందుకంటే