ఈ సమస్యలు ఉన్నవారు నెయ్యి జోలికి వెళ్ళవద్దు.. 

TV9 Telugu

05 August 2024

నెయ్యి లేనిదే భారతీయ పిండి వంటకాలు పూర్తికావు. స్వీట్స్ లాంటి తీపి పదార్దాల నుంచి పాటు ఇడ్లి, దోస వరకు దీన్ని ఉపయోగిస్తారు.

చాలామంది చపాతీపైన కూడా నెయ్యి రాసుకొని తినాడికి ఇష్టపడతారు. అలాగే పప్పుతో నెయ్యి వేసుకోని కూడా తింటారు.

ఇలా ప్రతి భారతీయ వంటల్లో నెయ్యి ఉపయీగించడం సర్వసాధారణం. నెయ్యి లేకుండా ఇండియన్ ఫుడ్స్ ను అస్సలు ఊహించలేము.

రోజు నెయ్యి తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలతో భాధపడేవారు మాత్రం నెయ్యి తీసుకోకూడదు.

గుండె, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు నెయ్యి అధికంగా ఉపయోగించకూడదు. తీసుకుంటే సమస్యలు పెరుగుతాయి.

ఉదార సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా నెయ్యి తీసుకోకూడదని అంటున్న పోషకాహార నిపుణులు. లేదంటే హాని కలుగుతుంది.

నెయ్యిలో ఉన్న ఫాటీ ఆసిడ్స్ కారణంగా రక్తపోటు పెరుగుతుంది. అందుకే రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా ఇది తినవద్దు.

నెయ్యి తీసుకునే విషయంలో డైటీషియన్‌ను సంప్రదించడమే మంచిది. వారిచ్చిన సూచనల మేరుకు నెయ్యి తీసుకోవాలా, వద్ద అని తెలుసుకోండి.