ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..

రోజంతా ఫోన్, కంప్యూటర్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారా? అయితే జాగ్రత్త.. ఈ అలవాటు కేవలం మీ కంటి చూపునే కాకుండా మీ గుండెను కూడా ప్రమాదంలో పడేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డిజిటల్ ఐ స్ట్రెయిన్ వల్ల కలిగే నష్టాలేంటి? ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి పాటించాల్సిన నియమం ఏమిటో తెలుసుకోండి.

ఫోన్ చూస్తూ నిద్రపోతున్నారా..? మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే..
Digital Eye Strain Symptoms

Updated on: Feb 27, 2026 | 8:30 PM

నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు లేకుండా రోజు గడవడం కష్టమైపోయింది. చాలామంది పగలు, రాత్రి తేడా లేకుండా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని ఎంతలా దెబ్బతీస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నిరంతరం స్క్రీన్లను చూడటం వల్ల కలిగే డిజిటల్ ఐ స్ట్రెయిన్ కేవలం కంటి అలసటనే కాకుండా తీవ్రమైన గుండె సమస్యలకు కూడా దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

మంగళూరులోని కెఎంసి హాస్పిటల్ కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ కీర్తన్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్కువ సమయం డిజిటల్ తెరలను చూడటం వల్ల కలిగే సమస్యను కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పిలుస్తారు.

లక్షణాలు: కంటి అలసట, కళ్ళు పొడిబారడం (Dry Eyes), తలనొప్పి మరియు చికాకు.

ఎవరికి ప్రమాదం: రోజుకు 7-8 గంటలు మొబైల్, కంప్యూటర్లు ఉపయోగించే ఐటీ ఉద్యోగులు, బ్యాంకు సిబ్బందిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

కారణాలు: కళ్లు రెప్పవేయడం తగ్గించడం , తప్పు భంగిమలో కూర్చోవడం.

మొబైల్ నీలి కాంతి – ఆరోగ్యంపై ప్రభావం

రాత్రిపూట మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలు..

నిద్ర సమస్యలు: మొబైల్ నుండి వెలువడే బ్లూ లైట్, నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.

గుండె – మధుమేహం: నిద్రలేమి వల్ల గుండె సమస్యలు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

కంటి చూపు: దూరపు చూపు తగ్గడం, దీర్ఘకాలిక తలనొప్పికి దారితీస్తుంది.

పరిష్కారం: 20-20-20 రూల్..

ఐటీ ఉద్యోగులకు లేదా అనివార్య పరిస్థితుల్లో ఎక్కువసేపు స్క్రీన్ చూడాల్సి వచ్చిన వారికి వైద్యులు కొన్ని సులభమైన పరిష్కారాలు సూచించారు.

20-20-20 నియమం: ప్రతి 20 నిమిషాల పని తర్వాత, 20 సెకన్ల విరామం తీసుకోండి. ఆ సమయంలో 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును చూడటం ద్వారా కంటి కండరాలకు విశ్రాంతి కల్పించండి.

స్క్రీన్ స్థానం: కంప్యూటర్ స్క్రీన్‌ను మీ కంటి స్థాయి కంటే కొద్దిగా కిందకు ఉంచండి. దీనివల్ల కనురెప్పలు సగం మూసుకుపోయి, కళ్లు తేమగా ఉంటాయి.

Follow Us