
పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మందిలో గోర్లు కొరికే అలవాటు ఉంటుంది. కానీ ఇది కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదు, ఆరోగ్యానికి, మన జీవితాలకు కూడా హానికరం అని ఆరోగ్య, జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోళ్లు కొరకడం వల్ల కలిగే నష్టాలు, వాటిని ఎలా నివారించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గోళ్ల కింద సూక్ష్మ క్రిములు, ధూళి, వివిధ రకాల బ్యాక్టీరియా పేరుకుపోతాయి. మనం గోళ్లు కొరికినప్పుడు.. అవి మన జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించి కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులకు కారణమవుతాయి. ఇది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గోళ్లు కొరికే అలవాటు సూర్య గ్రహాన్ని బలహీనపరుస్తుంది. దీనివల్ల వ్యక్తిలో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. కెరీర్‌లో అడ్డంకులు ఎదురవుతాయి. అంతేకాకుండా సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది.
గోళ్లు కొరకడం శని దోషానికి సంకేతంగా పరిగణిస్తారు. ఈ అలవాటు కారణంగా శని దృష్టి మీపై పడి, డబ్బు లేకపోవడం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే, ఈ అలవాటును వెంటనే మానేయడం చాలా ముఖ్యం.
కత్తిరించడం: మీ గోళ్లు పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం వల్ల వాటిని కొరికే అవకాశం ఉండదు.
ప్రత్యేక నెయిల్ పాలిష్: మార్కెట్లో చేదు రుచి కలిగిన నెయిల్ పాలిష్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడటం వల్ల గోళ్లు కొరికే అలవాటు క్రమంగా తగ్గుతుంది.
ఒత్తిడి : చాలామంది ఒత్తిడి లేదా ఆందోళనలో ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతారు. యోగా, ధ్యానం వంటి వాటిని పాటించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
గోళ్లు కొరకడం అనేది కేవలం ఒక చిన్న అలవాటుగా అనిపించినా, దాని వల్ల ఆరోగ్యపరంగా, జ్యోతిష్యపరంగా అనేక సమస్యలు వస్తాయి. అందుకే మీ ఆరోగ్యం, అదృష్టం రెండూ బాగుండాలంటే ఈ అలవాటును తక్షణమే మానుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..