గుట్టలాంటి పొట్టకు అద్భుతమైన ఛూమంత్రం.. కాఫీలో ఇది కలిపారంటే కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. గుండెపోటు సహా అన్ని సమస్యలకు అధిక బరువే కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు బరువు తగ్గడానికి వివిధ మార్గాలను ప్రయత్నిస్తున్నారు. వీటిలో ఒకటి నెయ్యి కాఫీ (Ghee Coffee) తాగడం.. దీనినే బుల్లెట్ కాఫీ అని కూడా అంటారు..

గుట్టలాంటి పొట్టకు అద్భుతమైన ఛూమంత్రం.. కాఫీలో ఇది కలిపారంటే కొవ్వు ఐస్‌లా కరగాల్సిందే..
Weight Loss Tips

Updated on: Jul 29, 2025 | 3:28 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. గుండెపోటు సహా అన్ని సమస్యలకు అధిక బరువే కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు బరువు తగ్గడానికి వివిధ మార్గాలను ప్రయత్నిస్తున్నారు. వీటిలో ఒకటి నెయ్యి కాఫీ (Ghee Coffee) తాగడం.. దీనినే బుల్లెట్ కాఫీ అని కూడా అంటారు.. ఇది సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతోంది. చాలా మంది ఫిట్‌నెస్ నిపుణులు దీనిని ఆరోగ్యకరమైనదిగా పిలుస్తారు. కానీ నెయ్యితో కాఫీ తాగడం నిజంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందా? నెయ్యి కాఫీ ప్రయోజనాలేంటి..? నష్టాలు ఏ విధంగా ఉంటాయి.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

నివేదికల ప్రకారం.. నెయ్యి కాఫీ అనేది.. ఒక చెంచా దేశీ నెయ్యి కలిపిన బ్లాక్ కాఫీ.. కొంతమంది దీనికి కొబ్బరి నూనె లేదా వెన్న కూడా కలుపుతారు.. కానీ దేశీ ఆవు నెయ్యిని భారతీయ ఇళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ కాఫీలో కొవ్వు ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.. అందుకే దీనిని బరువు తగ్గించే అద్భుతమైన పానీయంగా పరిగణిస్తారు.

బరువు తగ్గడానికి ఇది ఎలా సహాయపడుతుంది?

నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి ఎక్కువ కాలం శక్తిని అందిస్తాయి.. ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి కాఫీ తాగినప్పుడు, అది జీవక్రియను వేగవంతం చేస్తుంది.. ఉపవాస స్థితిని నిర్వహిస్తుంది. దీనివల్ల శరీరం ఇప్పటికే నిల్వ చేయబడిన కొవ్వును శక్తిగా ఉపయోగించుకుంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నెయ్యి కాఫీ వల్ల కలిగే ప్రయోజనాలు..

ఎనర్జీ బూస్టర్: నెయ్యి కాఫీ శరీరానికి ఎక్కువసేపు శక్తిని అందిస్తుంది.. తద్వారా మీకు అలసట తగ్గుతుంది.

ఆకలిని తగ్గిస్తుంది: ఇందులో అధిక కొవ్వు పదార్ధం ఉంటుంది.. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది.. తద్వారా పదే పదే తినాలనే కోరిక ఉండదు.

జీవక్రియను మెరుగుపరుస్తుంది: ఇది శరీర కొవ్వును కాల్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

మెదడుకు మేలు చేస్తుంది: నెయ్యిలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.

నెయ్యి కాఫీ వల్ల కలిగే దుష్ప్రభావాలు..

జీర్ణం కావడంలో ఇబ్బంది: ఈ కాఫీ కొవ్వును జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారికి లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి హానికరం కావచ్చు.

అధిక కేలరీలు: నెయ్యిలో చాలా కేలరీలు ఉంటాయి.. సమతుల్యంగా లేకపోతే, అది బరువు పెరగడానికి దారితీస్తుంది.

గుండె రోగులకు ప్రమాదకరం: అధిక సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉన్నందున, గుండె రోగులు దీనిని తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

ఖాళీ కడుపుతో గ్యాస్ సమస్య: కొంతమందికి, ఈ కాఫీని ఖాళీ కడుపుతో తాగడం వల్ల అసిడిటీ లేదా గ్యాస్ రావచ్చు.

నెయ్యి కాఫీని ఎలా తయారు చేయాలి..

నెయ్యి కాఫీని (ఘీ కాఫీ) తయారు చేయడానికి.. మీకు నచ్చిన కాఫీ పొడిని వేడి నీటిలో మరిగించి, ఆ తర్వాత అందులో ఒక టీస్పూన్ నెయ్యిని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తాగాలి.. ఇంకా రుచి కోసం కొద్దిగా స్వీటెనర్ లేదా దాల్చిన చెక్క పొడిని కూడా కలుపుకోని తాగవచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..