
కావాల్సిన పదార్థాలు : బోన్ లెస్ చికెన్, మెంతి పొడి చిటికెడు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు,నూనె, వీలైతే ఒక నిమ్మకాయ

తయారీ విధానం : ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా ఉడికించాలి. చికెన్ ముక్కలు మొత్తం ట్రై అవ్వాలి. ఇలా చేస్తే చాలా సులభంగా చికెన్ కారం పొడి చేయవచ్చును.

తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. అందులో నూనె పోసి, వీటిని బాగా బంగారు రంగు వచ్చే విధంగా వేయించి తీసుకోవాలి. తర్వాత ఇందులోనే అర కప్పు వెల్లుల్లి రెబ్బలు, అరకప్పు కరివేపాకు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఎండు మిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని బాగా మెత్తగా గ్రైన్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే చికెన్ ముక్కలు కూడా వేసి గ్రైన్ చేసుకోవాలి.

తర్వాత దీనిని మరోసారి వేయించుకోవాలి. తర్వాత దీనిపై కొంచెం గరం మసాలా లేకపోతే నిమ్మకాయ పిండి, పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిని గాలి చొరబడని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. అంతే చికెన్ కారం పొడి రెడీ.