అది ఇది వద్దు.. ఉదయాన్నే ఓ కప్పు వాము నీరు తాగండి చాలు.. ఆ సమస్యలకు షేకే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాము నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, జీర్ణ సమస్యలైన గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, కీళ్ల నొప్పులు, కొలెస్ట్రాల్, పీరియడ్స్ నొప్పి వంటి అనేక అనారోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

అది ఇది వద్దు.. ఉదయాన్నే ఓ కప్పు వాము నీరు తాగండి చాలు.. ఆ సమస్యలకు షేకే..
Ajwain Water

Updated on: Mar 11, 2026 | 9:58 AM

ప్రస్తుత ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది అధిక బరువు, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా అనేక వ్యాయామాలు ప్రయత్నించినప్పటికీ ఫలితం కనిపించని వారికి.. వాము నీరు ఒక సహజసిద్ధమైన, ప్రభావవంతమైన పరిష్కారం. డయాబెటిస్, అధిక లేదా తక్కువ రక్తపోటు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి వాము నీరు ఎంతగానో సహాయపడుతుంది.

మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి వాము ఒక అద్భుతమైన ఔషధం. ఆయుర్వేద మూల గ్రంథమైన అష్టాంగ హృదయంలో మహర్షి వాగ్భటాచార్య వామును వాత, పిత్త, కఫ నాశకారిణిగా వర్ణించారు. అంటే, కడుపులో ఏర్పడే గ్యాస్ (వాతం), ఎసిడిటీ (పిత్తం), శ్లేష్మం (కఫం) వంటి సమస్యలను ఇది నివారిస్తుంది. వాత దోషం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, శరీర నొప్పులు, గుండెలో నొప్పి వంటి సమస్యలకు వాము నీరు పరిష్కారం చూపుతుంది.

వాములో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, నికోటిన్ ఆసిడ్, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. వాము నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం కారణంగా వచ్చే పైల్స్ వంటి సమస్యల నివారణకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది.

వాము నీటిని తయారుచేసే విధానం:

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ వామును వేసి నానబెట్టాలి. ఉదయాన్నే వాము పూర్తిగా నానిపోయి, నీరు రంగు మారుతుంది. ఈ నీటిని నేరుగా లేదా గోరువెచ్చగా చేసుకుని తాగవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు గోరువెచ్చగా తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. మరొక పద్ధతిలో, వామును నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని చల్లార్చి తాగవచ్చు. ఈ పద్ధతి ముఖ్యంగా పీరియడ్స్ నొప్పి, గొంతు నొప్పి వంటి వాటికి ఉపశమనం కలిగిస్తుంది.

ఉదయాన్నే వాము నీరు తాగితే..

వాము నీరు శరీర మెటబాలిజంను పెంచుతుంది. ఆకలి లేని వారికి ఆకలిని కలిగిస్తుంది. దీర్ఘకాలంగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలనుకునే వారికి వాము నీరు ఒక అద్భుతమైన సహజ చికిత్స.. అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఈ నీటిని తాగడం మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us