Crying: బాధ అంతా లోపల పెట్టుకుని మదనపడకండి.. దు:ఖం వస్తే ఏడ్చేయండి

మీకు తెలుసా.. ఏడవడం ఆరోగ్యానికి కూడా మంచిదే. నలుగురు ఏమనుకుంటారని బాధను మనసులోనే దాచేయకండి. అది మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆ బాధను మీరు అదే పనిగా మోయాల్సి ఉంటుంది. అందుకే ఏడుపు వస్తే ఏడ్చేయండి. ఏడుపు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం పదండి...

Crying: బాధ అంతా లోపల పెట్టుకుని మదనపడకండి.. దు:ఖం వస్తే ఏడ్చేయండి
Samantha Crying

Updated on: Mar 14, 2024 | 1:00 PM

‘అలా ఏడుస్తావేంటిరా చిన్న పిల్లాడిలా..?’..  ‘అబ్బాయిలు ఎక్కడన్నా ఏడుస్తారా..?’ ఇలాంటి పదాలు మనం రెగ్యులర్‌గా వింటూ ఉంటాం. అంతేకాదు చిన్న చిన్న విషయాలకే ఏడుస్తావేంటి అని కిందరు ఆట పట్టిస్తూ కూడా ఉంటారు. అయితే ఏడవడం అంత బ్యాడ్ థింగ్ ఏం కాదు. అంతేకాదు ఏడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు. భావోద్వేగాలను అణచివేయడం అంత మంచిది కాదంటున్నారు. ఏడుపు వస్తే.. బిగ్గరగా ఏడ్చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతున్నారు. కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రశాంతంగా లభిస్తుంది: ఏడుపు మీకు ప్రశాంతతను ఇస్తుంది.  మనస్సు తేలిగ్గా ఉంటుంది. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోకుండా బాధ వచ్చినప్పుడు ఏడ్చేస్తే.. మనసు రిలాక్స్‌గా ఉంటుంది. ఇలా ఏడవడం వల్ల మనసు తేలికైన అనుభూతి కలుగుతుంది. అంతేకాదు ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. దాంతో మైండ్ రిలాక్స్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏడుపు వల్ల మనసు భారం కూడా తగ్గుతుంది. అలాగే శిశువుల ఏడుపు వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

స్ట్రెస్ నుంచి రిలీఫ్: ఏడుపు ఒక గొప్ప ఒత్తిడి నివారిణి. మీరు నొప్పిలో ఉన్నప్పుడు లేదా మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు భావించినప్పుడు ఏడవడం.. ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏడుపు గొప్ప ఔషధమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏడవకుండా మీ నొప్పిని లోపల ఉంచుకోవడం మరింత ఒత్తిడికి దారి తీస్తుంది.  మీకు ఏడవాలని అనిపించినప్పుడు, దాన్ని బయటకు వదిలేయండి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది.

కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి: ఏడిస్తే..  కళ్ల నుంచి కన్నీళ్లు వస్తాయి. వాటి నుంచి కంటిలోని హానికరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది. ఏడుపు కళ్లను శుభ్రపరుస్తుంది. ఏడుపు పొడి కళ్లను నివారిస్తుంది. ఏడుపు వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే ఏడుపు వల్ల లాభాలున్నాయి. నలుగురిలో ఏం మాట్లాడతారో అని ఆలోచించకండి. ఏడవకపోతే నీ బాధ నీలోనే ఉండిపోతుంది. నైరాశ్యంలో మునిగిపోతారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి