డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా.. కుక్కర్ మూతతో బరువైన కంబళ్లను ఇంట్లోనే శుభ్రం చేసే అద్భుత ట్రిక్!

చలికాలంలో బరువైన కంబళ్లు, దుప్పట్లను ఉతకడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. వీటిని డ్రై క్లీనింగ్ చేయించాలంటే ఖర్చు కూడా ఎక్కువే. అయితే వాషింగ్ మెషిన్ లేదా డ్రై క్లీనింగ్ లేకుండానే ఇంట్లో ప్రెషర్ కుక్కర్ మూత సహాయంతో కంబళ్లను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను 3 నుంచి 4 సార్లు పునరావృతం చేయడం వల్ల కంబళిలోని తేమ, చెడు వాసన పూర్తిగా తొలగిపోతాయి. చివరగా ఎండలో లేదా ఫ్యాన్ కింద ఆరబెడితే కంబళి కొత్తదానిలా తాజాగా మారుతుంది. వివరంగా తెలియాలంటే ఈ ఆర్టికల్‌ పూర్తిగా చదవాల్సిందే..

డ్రై క్లీనింగ్ ఖర్చు లేకుండా.. కుక్కర్ మూతతో బరువైన కంబళ్లను ఇంట్లోనే శుభ్రం చేసే అద్భుత ట్రిక్!
Pressure Cooker Lid Cleaning Hack

Updated on: Nov 22, 2026 | 9:15 AM

చలికాలం రాగానే బీరువాల్లో దాచిన కంబళ్లు, రజాయిలు బయటకు వస్తుంటాయి. తేలికపాటి దుప్పట్లను వాషింగ్ మెషిన్‌లో లేదా చేత్తో సులభంగా ఉతుక్కోవచ్చు. కానీ బరువైన, మందపాటి కంబళ్లను శుభ్రం చేయడం చాలా కష్టమైన పని. దీనికోసం ప్రతిసారీ డ్రై క్లీనింగ్‌కు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలాసార్లు కంబళ్లు మరీ మురికిగా ఉండవు కానీ, మూసిన అల్మారాలో ఉండటం వల్ల లేదా తేమ కారణంగా దుర్వాసన వస్తుంటాయి. అలాంటప్పుడు డ్రై క్లీనింగ్ అవసరం లేకుండానే కుక్కర్ మూతతో ఇంట్లోనే కంబళ్లను శుభ్రం చేసుకోవచ్చు. ఇంటిపట్టునే అందుబాటులో ఉండే సాధారణ వస్తువులతోనే ఈ పనిని చిటికెలో పూర్తి చేయవచ్చు.

కుక్కర్ మూతతో కంబళిని శుభ్రం చేసే విధానం

ఈ ఆసక్తికరమైన క్లీనింగ్ పద్ధతిని వివరించారు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో 1 చెంచా టాల్కమ్ పౌడర్, 2 చెంచాల బేకింగ్ సోడా తీసుకుని బాగా కలపాలి. కంబళి పెద్దదైతే మోతాదు పెంచుకోవాలి. బేకింగ్ సోడా కంబళిలోని చెడు వాసనను తొలగిస్తే, టాల్కమ్ పౌడర్ చక్కటి సువాసనను అందిస్తుంది.

పౌడర్ మిశ్రమాన్ని ఎలా వాడాలి?

ముందుగా కంబళిని నేలపై లేదా మంచంపై పూర్తిగా పరవాలి. ఇప్పుడు ఒక జల్లెడ సహాయంతో తయారు చేసుకున్న పౌడర్ మిశ్రమాన్ని కంబళి అంతటా సమానంగా చల్లాలి. దానిని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే, కంబళిలోని తేమ, దుర్వాసనను ఆ పౌడర్ పీల్చుకుంటుంది. తర్వాత చేతులకు గ్లౌజులు వేసుకుని లేదా శుభ్రమైన గుడ్డతో మెల్లగా రుద్దితే దుమ్ము వదులవుతుంది. దీనివల్ల కంబళి లోపల దాగి ఉన్న మట్టి కణాలు కూడా పైకి వస్తాయి.

ఇవి కూడా చదవండి

షాంపూ నీరు, కుక్కర్ మూతతో క్లీనింగ్

ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో నీరు తీసుకుని, అందులో కొద్దిగా షాంపూ లేదా ఫ్యాబ్రిక్ కండిషనర్ కలపాలి. ఈ నీటిలో ఒక శుభ్రమైన కాటన్ టవల్‌ను ముంచి నీరు లేకుండా గట్టిగా పిండాలి. ఇప్పుడు ఆ తడి టవల్‌ను ప్రెషర్ కుక్కర్ మూతపై గట్టిగా చుట్టాలి. ఈ మూతను కంబళిపై గుండ్రంగా తిప్పుతూ రుద్దాలి. ఇలా 3 నుంచి 4 సార్లు చేస్తూ, ప్రతిసారీ టవల్‌ను మంచి నీటితో కడిగి మళ్లీ వాడాలి. దీనివల్ల కంబళిపై పేరుకున్న దుమ్ము, మురికి, దుర్వాసన పూర్తిగా తొలగిపోతాయి.

ఎలా ఆరబెట్టాలి?

శుభ్రం చేసిన తర్వాత ఎండ ఉంటే కంబళిని కొన్ని గంటల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఒకవేళ ఎండ లేకపోతే ఇంట్లోనే ఫ్యాన్ కింద పరచి ఆరనివ్వాలి. దీనివల్ల కంబళిలో ఉన్న తేమ పూర్తిగా ఆరిపోయి, తాజాగా, శుభ్రంగా మారుతుంది. తక్కువ ఖర్చుతో, శ్రమ లేకుండా కంబళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ చిట్కా ఎంతో ఉపయోగపడుతుంది. ఇకపై ప్రతిసారీ డ్రై క్లీనర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us