Child Care Tips: మీ పిల్లలకు చదువే కీలకం కాదు.. అంతకంటే ముఖ్యమైంది మరోటి ఉంది.. అదేంటంటే..

|

Oct 03, 2023 | 11:26 AM

Child Care Tips: నేటి డిజిటల్ యుగంలో.. ప్రజల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజల జీవనశైలిలో కూడా చాలా మార్పులు వచ్చాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గంటల తరబడి ఫోన్లలో మునిగిపోతున్నారు. ఎక్కువ సమయం స్క్రీన్‌ను చూడటం వలన కళ్లపైనే కాకుండా.. ఆరోగ్య పరంగానూ దుష్ప్రభావం చూపుతోంది. ఇక పిల్లల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Child Care Tips: మీ పిల్లలకు చదువే కీలకం కాదు.. అంతకంటే ముఖ్యమైంది మరోటి ఉంది.. అదేంటంటే..
Children Outdoor Games
Follow us on

Child Care Tips: నేటి డిజిటల్ యుగంలో.. ప్రజల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రజల జీవనశైలిలో కూడా చాలా మార్పులు వచ్చాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గంటల తరబడి ఫోన్లలో మునిగిపోతున్నారు. ఎక్కువ సమయం స్క్రీన్‌ను చూడటం వలన కళ్లపైనే కాకుండా.. ఆరోగ్య పరంగానూ దుష్ప్రభావం చూపుతోంది. ఇక పిల్లల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో పిల్లలు ఔట్ డోర్ గేమ్స్ ఎక్కువగా ఆడేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. పిల్లలు ఆరుబయట ఆడుకోవడమే మర్చిపోయారు. బయటి గేమ్స్ కంటే.. ఫోన్‌లో ఆడుకోవడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. తద్వారా పిల్లలు ఫోన్లకు అడిక్ట్ అయిపోతున్నారు. ఇది వారికి ఏమాత్రం క్షేమకరం కాదు. అలాగే.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుల్లో ఉత్తమంగా రాణించాలని ఎక్కువ ఒత్తిడి తీసుకువస్తుంటారు. చదువులతో కుస్తీ పట్టిస్తుంటారు. కానీ, ఇది ఏమాత్రం సరికాదు. దీని ద్వారా పిల్లల్లో చాలా సమస్యలొస్తాయి. అందుకే పిల్లలను ఔట్ డోర్ గేమ్స్ ఆడిపించాలని సూచిస్తున్నారు నిపుణులు.

పిల్లలకు బయట ఆడుకోవడం, ఎగరడం, గెంతడం అనేది చాలా ముఖ్యం. ఇది పిల్లల శారీరక ఆరోగ్యానికే కాకుండా.. వారి మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైంది. ఇది పిల్లల వ్యక్తిత్వాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది. పిల్లలు బయట ఆడుకోవడం ఎంత ముఖ్యమో ఇవాళ మనం తెలుసుకుందాం..

శరీరానికి మంచి వ్యాయామం..

పిల్లలు బయట ఆడుకోవడం వల్ల శారీరకంగా దృఢంగా ఉంటారు. కానీ చాలా మంది తల్లిదండ్రులు గాయాలు అవుతాయేమోనన్న భయంతో బయట ఆడుకోనివ్వరు. కానీ పిల్లలు గాయపడినప్పుడు.. అది వారిని మరింత బలంగా మారుస్తుంది. పిల్లలకు ఇది చాలా మంచి వ్యాయామం. పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల శారీరక అభివృద్ధికి కూడా ఇది చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

కమ్యూనికేషన్ స్కిల్స్..

బయట ఆడుకోవడం వలన పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగవుతాయి. స్నేహితులతో సంభాషణలు పిల్లల వ్యక్తిత్వంపై సానుకూల ప్రభావం చూపుతాయి. దీంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగవుతాయి. దీంతో పిల్లల్లో సంకోచం కూడా తొలగిపోతుంది.

సామాజిక నైపుణ్యాలు..

బయట ఆడుకోవడం వలన పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. పిల్లలు మాట్లాడటం నేర్చుకుంటారు. పిల్లలు సాంఘికీకరించడం నేర్చుకుంటారు. బృందంతో కలిసి పని చేయడం ద్వారా ఎలా పని చేయాలో నేర్చుకుంటారు. దీని ద్వారా పిల్లలు ఇతరులతో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేర్చుకోగలుగుతారు.

మానసిక ఆరోగ్యం..

ఔట్ డోర్ గేమ్స్ పిల్లల మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది పిల్లలను ఒత్తిడి నుండి రక్షిస్తుంది. ఆడుకోవడం వలన పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. దీంతో పిల్లల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చదువులకు మంచిది..

పిల్లలు ఆడుకోవడం, గెంతడం వలన వారి మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీని ప్రభావం వారి చదువులపైనా చూపుతుంది. చదువులో పిల్లలు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు. ఇది పిల్లల్లో కష్టపడి పని చేసే స్ఫూర్తిని పెంపొందిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..