చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? వామ్మో జాగ్రత్త

మటన్.. చికెన్.. అబ్బ.. నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.. ఇక, కొంతమంది అయితే.. డైలీ మాంసాహారం ఉండాల్సిందే.. ముక్క లేనిదే ముద్ద దిగదు.. చాలామంది ఆదివారం నాన్ వెజ్ వంటలను వండుకోని తింటారు.. అయితే, ప్రస్తుతం సండే అనే కాదు.. వారాలతో పనిలేకుండా అన్ని రోజుల్లోనూ చికెన్, మటన్ తింటున్నారు.

చికెన్, మటన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? వామ్మో జాగ్రత్త
Chicken Liver , Mutton Liver

Updated on: Dec 17, 2025 | 3:24 PM

మటన్.. చికెన్.. అబ్బ.. నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు.. ఇక, కొంతమంది అయితే.. డైలీ మాంసాహారం ఉండాల్సిందే.. ముక్క లేనిదే ముద్ద దిగదు.. చాలామంది ఆదివారం నాన్ వెజ్ వంటలను వండుకోని తింటారు.. అయితే, ప్రస్తుతం సండే అనే కాదు.. వారాలతో పనిలేకుండా అన్ని రోజుల్లోనూ చికెన్, మటన్ తింటున్నారు. వీటిలో ప్రత్యేకమైన డిష్ లు తయారు చేసుకుని రుచి చూస్తుంటారు.. ముఖ్యంగా కొంత మంది మటన్, చికెన్ లోని పలు పార్ట్స్ ను ఇష్టపడుతారు.. అలాంటి వాటిలో లివర్ (కాలేయం) ఎక్కువ తింటుంటారు. లివర్ ఫ్రై, లివర్ కర్రీ.. ఇలా చాలా రకాలుగా వండుకుని తింటున్నారు. అయితే, చికెన్, మటన్ లివర్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? తింటే ఏమైనా నష్టం వాటిల్లుతుందా..? డైటీషియన్లు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

మటన్ లివర్ లాభాలు – నష్టాలు:

మటన్ (మేక, గొర్రె మాంసం) ను చాలా రకాలుగా వండుకుంటారు. అయితే.. మటన్‌లో అత్యంత పోషకమైన భాగం లివర్.. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, ఐరన్, రాగి, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ లివర్ ను తినడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు.. అంతేకాకుండా.. శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది. మటన్ లివర్‌ లో విటమిన్లు A, B, D కూడా అధికంగా ఉంటాయి.. ఇవి కళ్లు, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. దీనిలో ఉండే విటమిన్ బి12 రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అంతేకాకుండా నరాల బలహీనత సమస్యలను దూరం చేస్తుంది.

అయితే.. మటన్ లివర్ తినడం వల్ల లాభాలతోపాటు.. నష్టాలు కూడా చాలానే ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.. గర్భిణీలు మటన్ లివర్ ను తక్కువ పరిమాణంలో తినాలి.. అలాగే అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు మటన్ లివర్ ను తినకూడదు. దీనిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది.. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ మటన్ లివర్ కి దూరంగా ఉండాలి.

చికెన్ లివర్ లాభాలు – నష్టాలు:

చికెన్ లివర్ ఎన్నో పోషకాలు దాగున్నాయి.. చికెన్ లివర్ లో విటమిన్ ఎ, బి, ప్రోటీన్స్, మినరల్స్, ఐరన్, విటమిన్ బి 12, ఫోలేట్, కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి.. ముఖ్యంగా చికెన్ లివర్ లో సెలీనియం మంచి మొత్తంలో ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా ఆస్తమా, ఇన్ఫెక్షన్, శరీరంలో మంట, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి.. అలాగే చికెన్‌ లివర్‌తో కంటి, చర్మ, రక్తహీనత సమస్యలను దూరం చేయడంతోపాటు.. దీనిలో విటమిన్ బి12 మెదడు చురుగ్గా పని చేసేలా చేస్తుంది.

చికెన్‌లో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ సమస్యలు, ఫ్యాటీ లివర్‌తో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలి. చికెన్ లివర్ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కిడ్నీ వ్యాధితో బాధపడేవారు, జీర్ణ సమస్యలతో బాధపడేవారు చికెన్ లివర్ తినకూడదు.

ఇది కూడా చదవండి : చీపురు ఈ దిక్కున పెడితే ఇంట్లో ఐశ్వర్యం.. డబ్బుకు లోటుండదు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..