
మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో పోషకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు, పానియాలు ఎక్కువగా తీసుకుంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. ఐతే పోషకాలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు ప్రెగ్నెనెంట్ మహిళలు తినవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారంటే.. పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ-ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. గర్భిణీ మహిళలు వీటిని ఆహారంగా తీసుకుంటే ఇమ్యునిటీ శక్తి మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో పుట్టగొడుగులు ముందంజలో ఉంటాయి. అందువల్ల ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టగొడుగులను తినవచ్చు. ఐతే ఇవి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
mushrooms for pregnant women
మరిన్ని తాజా ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.