
శరీరంలో క్యాల్షియం లోపాన్ని అధిగమించడానికి మనం సాధారణంగా తాంబూలంలో ఉపయోగించే తినే సున్నం ఒక అద్భుతమైన, చౌకైన సహజ వనరుగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సున్నంలో క్యాల్షియం కార్బోనేట్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే, దీనిని ఎలా తీసుకోవాలి. ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకోవటం తప్పనిసరి.
ఆయుర్వేదం, ఆధునిక ఆరోగ్య నిపుణుల ప్రకారం, తినే సున్నంలో క్యాల్షియం కార్బోనేట్ చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ప్రాచీన కాలం నుండి భారతదేశంలో భోజనం తర్వాత తాంబూలం లో సున్నం రాసి నమలడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే. ఇది శరీరానికి అవసరమైన క్యాల్షియాన్ని సహజ పద్ధతిలో అందిస్తుంది.
క్రమంగా సున్నాన్ని తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. పెరుగుతున్న పిల్లలకు సున్నాన్ని ఇస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. దంతాలు కదలడం, పళ్ల నొప్పులు వంటి సమస్యలను ఇది నివారిస్తుంది.
ప్రసవ సమయంలో, ఆ తర్వాత మహిళలకు క్యాల్షియం అవసరం పెరుగుతుంది. నిపుణుల సలహాతో దీనిని తీసుకోవడం వల్ల తల్లికి, బిడ్డకు ఇద్దరికీ మంచిది. సున్నాన్ని ఔషధంగా తీసుకునేటప్పుడు మోతాదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో తీసుకుంటే అది నోరు, గొంతును పాడు చేస్తుంది. ఒక రోజుకు కేవలం ఒక గోధుమ గింజ అంత సున్నాన్ని మాత్రమే తీసుకోవాలి.
దీనిని నేరుగా తీసుకోకూడదు. ఒక గ్లాసు నీటిలో గానీ, తాజా మజ్జిగలో గానీ, లేదా ఏదైనా పండ్ల రసంలో బాగా కలుపుకుని ఉదయాన్నే తాగాలి. ఎవరికైనా కిడ్నీలో రాళ్లు లేదా క్యాల్షియం ఆక్సలేట్ సమస్య ఉంటే, వారు సున్నాన్ని అస్సలు తీసుకోకూడదు. ఇది వారి సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.
వీడియో ఇక్కడ చూడండి..
తినే సున్నం అనేది క్యాల్షియం లోపాన్ని నివారించడానికి తక్కువ ఖర్చుతో కూడిన ఒక అద్భుతమైన దేశీ చిట్కా. అయితే, ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని ప్రారంభించే ముందు ఒకసారి వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..