Brahmamudi, April 2nd episode: రాజ్ మరో త్యాగం.. కావ్యకు ఎండీ పోస్ట్.. అనామిక కన్నింగ్ ప్లాన్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ మాటలను తలుచుకుని ఇందిరా దేవి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే కావ్య వచ్చి.. మీరు ఇక్కడ ఉన్నారా? మీ కోసం ఇళ్లంతా వెతుకుతున్నా.. ఏమైంది అమ్మమ్మ గారూ అని అడుగుతుంది. ఏమైంది బాబును రాజ్ ఆఫీస్‌కి తీసుకెళ్లడంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. దీంతో అపర్ణ సీరియస్ అయి.. బిడ్డ కావాలా? కంపెనీ బాధ్యతలు కావాలా? అని షరతు పెట్టింది. దీంతో రాజ్ కొడుకే ముఖ్యమని, ఆస్తి కోసం తన బిడ్డను దూరం చేసుకోలేనని..

Brahmamudi, April 2nd episode: రాజ్ మరో త్యాగం.. కావ్యకు ఎండీ పోస్ట్.. అనామిక కన్నింగ్ ప్లాన్!
Brahmamudi
Follow us

|

Updated on: Apr 02, 2024 | 12:10 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. రాజ్ మాటలను తలుచుకుని ఇందిరా దేవి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే కావ్య వచ్చి.. మీరు ఇక్కడ ఉన్నారా? మీ కోసం ఇళ్లంతా వెతుకుతున్నా.. ఏమైంది అమ్మమ్మ గారూ అని అడుగుతుంది. ఏమైంది బాబును రాజ్ ఆఫీస్‌కి తీసుకెళ్లడంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. దీంతో అపర్ణ సీరియస్ అయి.. బిడ్డ కావాలా? కంపెనీ బాధ్యతలు కావాలా? అని షరతు పెట్టింది. దీంతో రాజ్ కొడుకే ముఖ్యమని, ఆస్తి కోసం తన బిడ్డను దూరం చేసుకోలేనని చెప్పేశాడు. వాడి మనసులో ఏముందో అర్థం కావడం లేదని పెద్దావిడ బాధ పడుతుంది. అవును అనుకున్నాను ఇలా జరుగుతుందని.. నేను ఉదయమే చెప్పాను. కానీ ఆపితే ఆగారా.. నా కొడుకు అని చెప్తాను అని తీసుకెళ్లారు. శ్వేతను అడ్డం పెట్టుకుని నన్ను పంపించేయాలని అనుకున్నారు. అప్పుడే బిడ్డను, బిడ్డ తల్లిని తీసుకొచ్చి నన్ను పంపించేయాలి కదా. బిడ్డ విషయం ఎందుకు దాచారు. ఏదో జరిగింది. ఆ బిడ్డ తల్లి గురించి కనుక్కోవాలి. బిడ్డ కన్న తల్లి బయటకు రావాలి. ఇక నుంచి నేను అదే పనిలో ఉంటాను అని కావ్య అంటుంది.

కళావతిని ఎండీగా చేయాలని రాజ్ నిర్ణయం..

ఈ సీన్ కట్ చేస్తే.. సుభాష్ జరిగిన విషయం గురించి బాధ పడుతూ ఉంటాడు. అప్పుడే రాజ్ వచ్చి.. డాడ్ మిమ్మల్ని అడగకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు కోపం వచ్చిందా.. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈ రోజు ఆ నమ్మకం బ్రేక్ చేశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో దారి కనిపించలేదని అంటాడు రాజ్. ఇప్పుడు నీకో అవకాశం ఉంది రాజ్.. కానీ నువ్వు ఆ దారిని వద్దు అనుకుంటున్నావ్. ఆస్తులతో పాటు బంధాలు, బంధుత్వాలు అన్నీ కోల్పోవాల్సి ఉంటుందని సుభాష్ అంటాడు. నేను చాలా దూరం వచ్చేశాను. ఇక వెనక్కి వెళ్లలేను. ఈ విషయం పక్కన పెడితే.. రేపు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం గురించి మాట్లాడటానికి వచ్చాను. ఇప్పుడు నా స్థానంలో ఎవర్ని మేనేజింగ్ డైరెక్టర్ చేయాలి అనుకుంటున్నారు? అని రాజ్ అడుగుతాడు. ఏమోరా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా గొడవలు అవుతాయని సుభాష్ అంటాడు. కళ్యాణ్‌కు ఎండీగా ఉండటం ఇష్టం లేదు. రాహుల్‌కి కూడా అంత క్యాపిబులిటీ లేదు. కాబట్టి కళావతిని ఎండీగా చేయాలని అనుకుంటున్నా అని రాజ్ అంటాడు. దీంతో సుభాష్ షాక్ అవుతాడు.

ఇంత ప్రేమ ఉన్నా ఎందుకు అన్యాయం చేస్తున్నావ్..

ఇప్పుడు ఈ నిర్ణయం మామ్‌కి ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు మరో ఆప్షన్ కనిపించడం లేదు. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుందని సుభాష్ అంటాడు. మామ్‌కు ఏదో ఒకటి చెప్పండి. కానీ కళావతిని మాత్రం ఎండీని చేయండి. తనకు ఆ క్యాపిబులిటీ ఉంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా ముందు ఉండి నడిపిస్తుందని రాజ్ అంటాడు. సరే అని సుభాష్ అంటాడు. రాజ్.. కావ్య మీద ఇంత ప్రేమ ఉంది. మరి ఎందుకు తనకు అన్యాయం చేస్తున్నావ్? అని సుభాష్ అడిగితే.. రాజ్ మౌనంగా వెళ్లిపోతాడు.

ఇవి కూడా చదవండి

రాజ్‌ని నిలదీసిన కావ్య..

ఇక బాబును ఆడిస్తూ ఉంటుంది కావ్య. ఏరా నన్ను చూస్తే నీకు నవ్వులాటగా ఉందా.. ఏమీ తెలియని నువ్వు.. అన్నీ తెలిసిన ఆ దేవుడు ఇద్దరూ నన్ను బొమ్మను చేసి ఆడుకుంటున్నారు అని బాధ పడుతుంది కావ్య. అప్పుడే రాజ్ వచ్చి నవ్వుతూ ఉంటాడు. రాజ్‌ని చూసి నేనేదో కాంప్రమైజ్ అయిపోయాను అని అనుకుంటున్నారా? అన్నింటినీ దూరం చేసుకుని ఏం చేద్దామని? మరోవైపు ఆ పసి బిడ్డకు కూడా అమ్మ ప్రేమను కూడా దూరం చేస్తున్నారు. అటు కళ్యాణ్‌కు కవిత్వం తప్ప.. మరొకటి తెలియదు. మరోవైపు రాహుల్‌కి జల్సాలు తప్పా.. కంపెనీని పైకి తీసుకురావడమే తెలీదు. చేతులెత్తేసి కంపెనీని గాల్లో వదిలేశారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అని రాజ్‌ని నిలదీసి వెళ్లిపోతుంది కావ్య. అయినా రాజ్ ఏమీ మాట్లాడకుండా నవ్వుతాడు. ఇన్ని తెలిసిన నీకంటే ఇంకెవరు సమర్థులు ఉంటారు కళావతి. నేను లేని లోటు నువ్వు తీర్చుతావ్ అని మనసులో అనుకుంటాడు.

రుద్రాణి మాస్టర్ ప్లాన్..

ఇక తెల్లారుతుంది. రాహుల్, అనామిక, రుద్రాణిలు బయట నిల్చుంటారు. కావాలనే అనామికను రెచ్చగొట్టి.. కళ్యాణ్‌ను ఎండీని చేయమని వెళ్లి అపర్ణను అడుగు అని అంటుంది. దీంతో అనామిక కూడా ఓకే అని అంటుంది. ఏంటి మామ్ తనకు అలా చెబుతున్నావ్. తల్లివై ఉండి నాకు ద్రోహం చేస్తావా అని రాహుల్ అంటాడు. ఒరేయ్ పిచ్చోడా.. కావాలనే అనామిక ముందు నటించాను రా. ఇప్పుడు వెళ్లి అనామిక.. కళ్యాణ్‌ను చైర్మన్ కావాలని అడిగితే.. స్వప్ప వెళ్లి అడ్డుపడి నిన్ను చైర్మన్ చేయమని అడుగుతుందని రుద్రాణి అంటుంది. రాహుల్ నవ్వి.. స్వప్నా మనకు ఎందుకు సహాయం చేస్తుంది అని అంటాడు. చేసేలా నేను చేస్తాను అని అంటుంది రుద్రాణి.

రుద్రాణి కన్నింగ్ ప్లాన్‌లో చిక్కిన స్వప్న..

ఇక ప్లాన్ ప్రకారం రుద్రాణి, రాహుల్ స్వప్న గది దగ్గరకు వెళ్తారు. స్వప్నను చూసి కావాలనే ఎండీ పోస్ట్ గురించి మాట్లాడతారు. ఆ అనామిక వెళ్లి ఇప్పుడు వదినను కళ్యాణ్‌ని ఎండీని చేయమని అడుగుతుంది. కానీ నువ్వు కూడా ఎండీ పోస్ట్‌లో కూర్చోవాలంటే మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు రా. నీ భార్య కూడా నిన్ను పట్టించుకోదని అంటుంది. ఇవన్నీ విన్న స్పప్న.. కళ్యాణ్‌ ఎండీ అయితే.. అనామిక తిక్క పెరిగిపోతుంది. అలా జరగకూడదు అంటే రాహుల్ ఎండీ అవ్వాలి అని అనుకుంటుంది.

మొగుడు కోసం స్వప్న పోరాటం..

కట్ చేస్తే.. హాలులో పెద్దాయన, పెద్దావిడ, అపర్ణ, ధాన్యంలు కూర్చుని ఉంటారు. అనామిక వాళ్ల దగ్గరకు వెళ్లి.. అమ్మమ్మ గారూ.. ఈ ఇంట్లో స్వప్నకు అవసరాలు ఉన్నాయని.. అడగకుండానే ఆస్తిలో భాగం రాసిచ్చారు. కానీ ఇప్పుడు నాకు ఏ అవసరాలు లేవు. కానీ ఒక్కటి అడగడానికి వచ్చాను. అడగొచ్చా అని అనామిక అంటుంది. అడగమని పెద్దావాళ్లు అంటారు. బావగారు ఎండీ పోస్ట్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు అది ఖాళీ అయిపోయింది. కాబట్టి ఈ ఇంటి వారసుడిగా కళ్యాణ్‌ని ఎండీగా చేయవచ్చు కదా అని అడుగుతుంది. అనామిక మాటలు విన్న అపర్ణ రాజ్‌ని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయానికి రాలేదని సీతా రామయ్య అంటాడు. ఇప్పుడు రావచ్చు కదా.. కళ్యాణ్‌ ఎలానో ఈ ఇంటి వారసుడే కదా.. ఇప్పుడు ఎండీ సీటులో కూర్చోబెట్టండి అని ధాన్య లక్ష్మి అంటుంది. కళ్యాణ్‌కు బిజినెస్ మీద అసలు ఇంట్రెస్టే లేదు కదా ఆంటీ తన లోకంలో తాను ఉంటాడు. రాజ్‌లా కంపెనీని నడపలేడు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే.. ఆ స్థానంలో కూర్చోవడానికి రాహుల్‌కి మాత్రమే అర్హత ఉందని అంటుందని స్వప్న అంటుంది. స్వప్న మాటలకు ఇంట్లోని వారందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత రుద్రాణి అందుకుంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.