గుండె జబ్బులను హడలెత్తించే దోస గింజలు.. కాసిన్ని తిన్నా చాలు
27 July 2024
TV9 Telugu
TV9 Telugu
దోసకాయలు అనగానే మనకు గుర్తొచ్చేది సలాడ్‌లు. నీటితో కూడిన ఇవి దాహం తీరటానికి బాగా ఉపయోగపడతాయి. పైగా ఇవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి
TV9 Telugu
దోసకాయను చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. అయితే దోసకాయ మాత్రమే కాదు అందులోని గింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
TV9 Telugu
ముఖ్యంగా ఈ గింజను తినడం వల్ల గుండె జబ్బులు దూరం అవుతాయి, చర్మం మెరుస్తుంది. జబ్బుల నివారణకు, బరువు అదుపులో ఉండటానికి, జీర్ణక్రియకు తోడ్పడతాయి
TV9 Telugu
దోసకాయ గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే మలబద్ధకంతో బాధపడేవారు దోసకాయ గింజలను తింటే మంచిది
TV9 Telugu
దోసకాయ గింజలలో యాంటీఆక్సిడెంట్లు, జింక్ అధికంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, మంచి గుండె ఆరోగ్యాన్ని అందిస్తుంది
TV9 Telugu
దోసకాయ గింజలు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దోసకాయ గింజలలో మెగ్నీషియం, పొటాషియం కూడా అధికంగా ఉంటాయి
TV9 Telugu
ఈ రెండు ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉండే దోసకాయ గింజలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి
TV9 Telugu
ఈ విత్తనాలు తింటే పొట్ట త్వరగా నిండుతుంది. దోసకాయ గింజలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో కూడా సహాయపడతాయి. దోస గింజల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. వీటిల్లోని కొ వ్వు ఆమ్లాలు చర్మాన్ని తేమగా ఉంచడంలో, చర్మ ప్రకాశాన్ని కాపాడడంలో సహాయపడతాయి