సాధారణంగా గుడ్లు అందరూ ఇష్టంగా తింటారు. ఇందులో మాంసకృత్తులు, అవసరమైన విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే గుడ్డును పోషకాహార పవర్‌హౌస్ అని అంటారు. మీ హెల్తీ డైట్ లో గుడ్లను చేర్చుకోవడం చాలా మంచిదని నిపుణులు సైతం అంటున్నారు. కానీ చాలా మంది ఉడకబెట్టిన గుడ్లు తింటే మంచిదా? ఆమ్‌లెట్ తింటే మంచిదాని తికమక పడుతుంటారు. కొంతమంది ఈ రెండు రకాల ఆహారాలను ఉదయం అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు. రెండు ఎంపికలు రుచికరమైనవే. కానీ ఏది మంచిదన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ విషయం ఇక్కడ తెలుసుకుందాం..
గుడ్లు ఉడికించి తినడం ఆరోగ్యకరం. ఈ పద్ధతి చాలా పోషకాలను పొందడానికి సహాయపడుతుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం.. ఉడికించిన గుడ్డులో 6 గ్రాముల అధిక-నాణ్యత ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు, కండరాలను బలోపేతం చేయడానికి అద్భుతమైన ఎంపిక. అంతేకాకుండా ఉడికించిన గుడ్డులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలతో పాటు B12, A, D వంటి అవసరమైన విటమిన్లు అధికంగా ఉంటాయి. బరువు పెరగకుండా చేస్తుంది. అంతేకాకుండా, ఉడికించిన గుడ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత కంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన అధ్యయనం కూడా శరీర మొత్తం ఆరోగ్యానికి గుడ్డు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించింది.
సాధారణంగా ఆమ్లెట్ కూరగాయలు, చీజ్, మాంసం వంటి అనేక రకాల ఇతర పదార్థాలతో కలిపి తయారు చేస్తారు. తద్వారా వివిధ రకాల రుచులలో గుడ్డు రుచులను ఆస్వాదించవచ్చు. ఇది పోషక విలువలను గణనీయంగా పెంచుతుంది. గుడ్డు ఆమ్లెట్‌లో కూరగాయలను జోడించడం వల్ల ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. అదనపు విటమిన్లు, ఖనిజాలను శరీరానికి అందిస్తుంది. కానీ ఆమ్లెట్‌లోని పోషక విలువలు అందులో వినియోగించే పదార్థాలపై ఆధారపడి మారవచ్చు. కేవలం గుడ్లతో తయారు చేసిన ఆమ్లెట్‌లో ఉడికించిన గుడ్లలో ప్రోటీన్ కంటెంట్ ఉన్నప్పటికీ, ఇందులో జున్ను లేదా వంట నూనెలను జోడించడం వల్ల కేలరీలు, అనారోగ్య కొవ్వులు పెరుగుతాయి.
గుడ్డులో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ కొవ్వులలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా ఉండాలంటే వంట సమయంలో ఎంత జున్ను లేదా ఎంత నూనె వేస్తున్నారో గమనిచాలి. అనే విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.
ఉడికించిన గుడ్డు.. అదనపు కేలరీలు, అనారోగ్యకరమైన కొవ్వు లేకుండా సులభమైన, పోషక-దట్టమైన ఆహారం. అది కూడా తక్కువ సమయంలోనే తయారవుతుంది. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనం త్వరగా ప్రిపేర్ చేయాలనుకుంటే, ఉడికించిన గుడ్డు బెస్ట్ ఎంపిక. కూరగాయలు, అధిక మొత్తంలో చీజ్ లేదా హానికరమైన నూనెలు వంటి అదనపు పదార్థాలతో చేసిన ఆమ్లెట్లు పోషక విలువలో హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఉడికించిన గుడ్లు కేలరీలు తక్కువగా ఉండే చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారం. కాబట్టి వ్యక్తిగత ప్రాధాన్యత ఆధారంగా వీటి పోషక విలువలు ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.