Black Garlic Benefits: నల్లగా ఉన్నాయని లైట్‌ తీసుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

సాధారణంగా మనం వంటల్లో తెల్లటి వెల్లుల్లిని వాడుతుంటాం. కానీ ఇటీవల బ్లాక్ గార్లిక్ (నల్ల వెల్లుల్లి) గురించి బయట బాగా చర్చ జోరందుకుంది. దీని రంగు, రుచి, పోషక విలువలు తెల్ల వెల్లుల్లి కంటే భిన్నంగా ఉంటాయి. కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఇది అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Black Garlic Benefits: నల్లగా ఉన్నాయని లైట్‌ తీసుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
Black Garlic Benefits

Edited By:

Updated on: Dec 25, 2025 | 3:13 PM

నల్ల వెల్లుల్లి అనేది ఏదో ప్రత్యేకమైన రకం కాదు. సాధారణ వెల్లుల్లిని కొన్ని వారాల పాటు నిర్దిష్ట ఉష్ణోగ్రత (60-90°C) తేమ వద్ద పులియబెట్టడం ద్వారా ఇది తయారవుతుంది. ఈ ప్రక్రియలో వెల్లుల్లి రెబ్బలు నల్లగా మారుతాయి. దీని రుచి తీపిగా, ఆకృతి జెల్లీలా మెత్తగా ఉంటుంది. కేవలం రుచి కోసమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఇది అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. .

బ్లాక్ గార్లిక్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

గుండె ఆరోగ్యానికి మేలు: నల్ల వెల్లుల్లి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వృద్యాప్ప సమస్యలకు చెక్: ఫెర్మెంటేషన్ ప్రక్రియ వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల శాతం సాధారణ వెల్లుల్లి కంటే రెండింతలు పెరుగుతుంది. ఇవి శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా, వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు.

రోగనిరోధక శక్తి పెంపు: ఇందులోని అల్లిసిన్ అనే సమ్మేళనం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది వరం లాంటిది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి, బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉండేలా చూస్తుంది.

మెదడు పనితీరు మెరుగుదల: నల్ల వెల్లుల్లిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. ఇది జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

దీనిని నేరుగా కూడా తినవచ్చు ఎందుకంటే పచ్చి వెల్లుల్లిలాగా ఘాటుగా ఉండదు. సలాడ్లు, సాస్‌లు లేదా సూప్‌లలో కలిపి తీసుకోవచ్చు. బ్రెడ్ టోస్ట్‌లపై గార్నిష్‌గా వాడుకోవచ్చు. బ్లాక్ గార్లిక్ రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా సూపర్‌ఫుడ్. అయితే, ఏదైనా కొత్త ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకునే ముందు, ముఖ్యంగా గర్భిణులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్లైట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.