
కుక్కల జీర్ణవ్యవస్థ మానవుల కంటే భిన్నంగా ఉంటుంది. మనం సులభంగా జీర్ణించుకునే కొన్ని రసాయనాలు కుక్కల శరీరంలో చేరినప్పుడు అవి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి. ఉల్లిపాయల నుండి పుట్టగొడుగుల వరకు, మనం నిత్యం వాడే కొన్ని వస్తువులు కుక్కల ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తాయి. అంతేకాకుండా, ఐస్ క్రీమ్ వంటి పదార్థాలు వాటికి తీవ్రమైన అలెర్జీలను కలిగిస్తాయి. మీ శునకాన్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలంటే వాటి డైట్ నుండి వెంటనే తొలగించాల్సిన 7 ముఖ్యమైన పదార్థాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ప్రమాదకరమైన ఉల్లి, వెల్లుల్లి :
కుక్కలకు అత్యంత ప్రమాదకరమైన కూరగాయలలో ఉల్లిపాయలు వెల్లుల్లి మొదటి వరుసలో ఉంటాయి. వీటిలో ఉండే ‘థియోసల్ఫేట్’ (Thiosulphate) అనే రసాయనం కుక్కల ఎర్ర రక్త కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల రక్తహీనత (Anemia) ఏర్పడి, అవి నీరసించిపోతాయి. వెల్లుల్లి ఉల్లిపాయ కంటే ఐదు రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి, కూరలు కలిపిన అన్నం లేదా ఉల్లిపాయలు ఉన్న పదార్థాలను వాటికి అస్సలు పెట్టకూడదు.
పుట్టగొడుగులు టమోటాలు:
మనుషులకు ఎంతో ఇష్టమైన పుట్టగొడుగులు కుక్కలకు మాత్రం ప్రాణాంతకం కావచ్చు. కొన్ని రకాల పుట్టగొడుగులు వాటి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి, అవయవాలు పనిచేయకుండా చేస్తాయి. అలాగే, ఎర్రటి టమోటాలు కొంచెం సురక్షితమైనా, పచ్చి టమోటాలు మరియు టమోటా మొక్కల ఆకులు, కాండం కుక్కలకు విషపూరితం. వీటిలో ఉండే ‘సోలనిన్’ అనే పదార్థం కుక్కలలో గుండె సమస్యలు జీర్ణకోశ ఇబ్బందులకు కారణమవుతుంది.
ఇతర హానికర పదార్థాలు:
కేవలం కూరగాయలే కాదు, ఐస్ క్రీమ్‌లోని లాక్టోస్‌ను కుక్కల శరీరం తట్టుకోలేదు. దీనివల్ల వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే, ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు వాటికి సోడియం అయాన్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి. మద్యం లేదా ఆల్కహాల్ కలిగిన పదార్థాలు కుక్కలలో కోమాకు లేదా మరణానికి కూడా కారణం కావచ్చు. పెంపుడు జంతువుల ఆరోగ్యం పూర్తిగా యజమాని బాధ్యతపైనే ఆధారపడి ఉంటుంది, కాబట్టి వాటికి పౌష్టిక ఆహారం మాత్రమే అందించడం శ్రేయస్కరం.