నిద్రలేమి.. ఇటీవల చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో చాలా మంది వైద్యులను సంప్రదిస్తున్నారు. నిద్రలేమి ఎన్నో రకాల ఇతర అనారోగ్య సమస్యలకు సైతం దారి తీస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్, బీపీ, హృదయ సంబంధిత వంటి ఎన్నో సమస్యలకు నిద్రలేమి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే నిద్రలేమి సమస్యకు యోగా చక్కటి పరిష్కారమని మీకు తెలుసా.? కొన్ని రకాల యోగసనాలతో నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడ తెలుసుకుందాం..
* నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టేందుకు సేతు బాలాసనం బాగా ఉపయోగపడుతుంది. ఈ యోగాసనంతో ఛాతీలో ఒత్తిడి, తగ్గి వెన్నెముక రికాల్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గడంతో మంచి నిద్ర సొంతమవుతుంది. ఈ యోగాసనం చేయడానికి ముందుగా బోర్లా పడుకుని… మోకాలు, కుడి చేతిని పక్కకు మడిచిపెట్టాలి. ఎడమ కాలు, ఎడమ చేయి కిందికి తిన్నగా ఉంచి రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల మంచి నిద్ర సొంతమవుతుంది.
* శవాసనం కూడా నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, తలనొప్పి, అలసట, ఆందోళన వంటివి తగ్గిపోతాయి. బీపీ కంట్రోల్‌లోకి వచ్చి, మంచి నిద్ర సొంతమవుతుంది. ఇక ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే.. కాళ్లు, చేతులు చాపి వెల్లకిలా పడుకోవాలి. అనంతరం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మనసును ప్రశాంతంగా చేసుకోవాలి. ఇలా చేస్తే క్షణాల్లో నిద్రలోకి జారుకుంటారు.
* పాదహస్తాసనం కూడా నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఇందుకోసం ముందుగా నిటారుగా నిలబడాలి. అంనతరం నెమ్మదిగా చేతులను పైకి లేపి, గాలిని నెమ్మదిగా వదులుతూ నడుమును రెండు చేతులతో రెండు కాళ్ల మునివేళ్లను తాకాలి. ఇలా చేయడం వల్ల అపానవాయువు, మలబద్ధకం, అజీర్ణాన్ని తగ్గిస్తుంది, జీవక్రియ మెరుగవుతుంది.
* నిద్రలేమి సమస్యను దూరం చేయడంలో బద్ధకోణాసనం కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా కింద కూర్చొని రెండు కాళ్లను దగ్గరకు జోడించాలి. అనంతరం రెండు కాళ్లను సీతాకోక చిలుక రెక్కలు ఆడించినట్లు అడించాలి. ఇలా చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అయి మంచి నిద్రను అందిస్తాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..