అంజీర్‌ను ఇలా తింటే జీర్ణ సమస్యలు పరార్.. గుండె సెఫ్..! మరెన్నో లాభాలు

అంజీర్ పండు ఫైబర్, పొటాషియం పుష్కలంగా కలిగి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. నానబెట్టిన అంజీర్ లేదా సలాడ్లు, ఓట్స్, పెరుగుతో కలిపి తీసుకోవడం ద్వారా ఈ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అంజీర్‌ను ఇలా తింటే జీర్ణ సమస్యలు పరార్.. గుండె సెఫ్..! మరెన్నో లాభాలు
Fig

Updated on: Nov 25, 2025 | 2:10 PM

అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అంజీర్ తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. బీపీ అదుపులో ఉంటుంది. ఉదయాన్నే నానబెట్టిన 2 అంజీర్ పండ్లు తినండి. నానబెట్టిన అంజీర్‌ తింటే ఫైబర్‌ బాగా అందుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం రాదు. అంజీర్‌ను ముక్కలుగా కట్‌ చేసి ఓట్స్‌లో కలిపి తీసుకోవాలి. ఇందులో వాల్‌నట్స్‌ కూడా యాడ్‌ చేసుకోవచ్చు. వీటిలోని ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

పండ్ల సలాడ్స్‌లో కూడా అంజీర్‌ను యాడ్‌ చేసుకోవచ్చు. ఫ్రూట్‌ సలాడ్‌లో ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, విత్తనాలు కలిపి తింటే రుచితో పాటు ఆరోగ్యం లభిస్తుంది. పెరుగుతో పాటు రెండు తాజా అంజీర్ పండ్లను కలిపి తింటే రుచిగా ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వేయించిన శనగలు, బాదం‌తో పాటు కొన్ని అంజీర్ ముక్కల్ని కూడా వేసి తినొచ్చు. వీటిని తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

హోల్ గ్రెయిన్ టోస్ట్‌ని అంజీర్, పెరుగుతో కలిపి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె ఆరోగ్యంగా మారుతుంది. అంజీర్‌ను సిరప్ రూపంలో కూడా తీసుకోవచ్చు. పాలు లేదా నీళ్లలో అంజీర్ సిరప్ కలిపి తాగితే మంచిది. అంజీర్‌ని వివిధ రకాల సూప్‌లో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ సూప్‌ చాలా తేలికగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల ఓవరాల్‌ హెల్త్ మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..