Beauty Tips: కళ్లకింద ముడతలు తొలగాలంటే ఈ 5 పదార్థాలు బెస్ట్‌.. ఖర్చు కూడా పెద్దగా ఉండదు..!

|

Apr 09, 2022 | 3:45 PM

Beauty Tips: వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై, కళ్లకింద ముడతలు సహజం. కానీ అకాల ముడతలు ఏర్పడితే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సకాలంలో చికిత్స

Beauty Tips: కళ్లకింద ముడతలు తొలగాలంటే ఈ 5 పదార్థాలు బెస్ట్‌.. ఖర్చు కూడా పెద్దగా ఉండదు..!
Wrinkles
Follow us on

Beauty Tips: వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై, కళ్లకింద ముడతలు సహజం. కానీ అకాల ముడతలు ఏర్పడితే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సకాలంలో చికిత్స తీసుకోకపోతే అవి విపరీతంగా పెరుగుతాయి. ఇది నేరుగా మీ అందాన్ని ప్రభావితం చేస్తుంది. కళ్ల కింద ముడతలు మీ వయస్సును ఎక్కువగా చూపుతాయి. ముఖం అనారోగ్యంగా కనిపిస్తుంది. అయితే మార్కెట్లో వీటిని తగ్గించడానికి అనేక ప్రొడాక్ట్స్‌ వచ్చాయి. కానీ వాటివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. ఈ ముడతల సమస్యతో పాటు కళ్ల కింద నల్లటి వలయాలు కూడా నయం చేసే కొన్ని హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఇవి కచ్చితంగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కానీ ఒక పద్దతి ప్రకారం చేయాలి.

1. టొమాటో

టొమాటో మీ చర్మం కాంతిని పెంచడానికి పని చేస్తుంది. అంతేకాదు దీనిని ముడతలకు శత్రువు అంటారు. టొమాటో గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి పేస్ట్ లా చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి ఆరనివ్వాలి. అరగంట తరువాత చర్మాన్ని శుభ్రం చేయాలి. మంచి ఫలితాలు ఉంటాయి.

2. గ్రీన్ టీ

గ్రీన్ టీ బ్యాగ్‌లను ఉపయోగించిన తర్వాత వాటిని ఫ్రిజ్‌లో పెట్టండి. తర్వాత వాటిని కళ్లపై పెట్టుకోండి. ఇది మీ ముడతల సమస్యను దూరం చేస్తుంది. ఇది కాకుండా రోజూ సాధారణ టీకి బదులుగా గ్రీన్ టీ తాగండి.

3. అవకాడో

అవకాడో గుజ్జును తీసి బాగా మెత్తగా చేయాలి. దీన్ని మీ కళ్ల చుట్టూ అప్లై చేసి మసాజ్ చేయాలి. సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా మంచి ఫలితాలను పొందుతారు.

4. బాదం నూనె

బాదం నూనె ముడతల సమస్యను తొలగించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి కళ్లచుట్టు బాదం నూనెతో మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. కొద్దిరోజులకి నల్లటి వలయాలు కనిపించడం మీరు గమనించవచ్చు.

5. పుష్కలంగా నీరు తాగాలి

నీరు లేకపోవడం వల్ల చర్మం డీ హైడ్రేట్‌ అవుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. దీనివల్ల చర్మం హైడ్రేట్‌గా మారుతుంది. ముడతల సమస్య ఉండదు. వేసవి కాలంలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం. ఈ సందర్భంలో రోజుకు కనీసం 4 లీటర్ల నీరు తాగాలి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Health: తల్లి దండ్రులకి జాగ్రత్త.. ఈ సమస్య పిల్లలు, వృద్ధులకి చాలా డేంజర్..!

IPL 2022: దినేశ్‌ కార్తీక్ మళ్లీ టీమ్‌ ఇండియాకి తిరిగి వస్తాడు.. ఆశాభావం వ్యక్తం చేసిన మాజీ కోచ్..!

ఈ 2 ప్రభుత్వ పథకాలలో విపరీతంగా పెట్టుబడులు.. ప్రతినెలా పెన్షన్ పెద్ద మొత్తంలో డబ్బు..!